Saturday, November 30, 2024

E-Paper

Homeతెలంగాణకీటక జనిత వ్యాధులను నియంత్రించాలి డాక్టర్ అమర్ సింగ్ నాయక్

కీటక జనిత వ్యాధులను నియంత్రించాలి డాక్టర్ అమర్ సింగ్ నాయక్

ఆయుధం వరంగల్
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అదనపు సంచాలకులు మలేరియా ఫైలేరియా డాక్టర్ అమర్ సింగ్ నాయక్ వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లాల వైద్యాధికారులు వరంగల్ హనుమకొండ, ప్రోగ్రామ్ ఆఫీసర్లు, డిప్యూటీ డిఎంహెచ్వోలు , కీటకజంత వ్యాధుల నియంత్రణ సిబ్బందితో సమీక్ష సమావేశంలో నిర్వించారు. జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్న దృష్ట్యా డివిజన్ల వారీగా కీటక జనిత వ్యాధుల నియంత్రణ కు చేపడుతున్న చర్యల గురించి వివరాలు తెలుసుకొని చేపట్టాల్సిన నివారణ చర్యల గురించి వివరించారు జిల్లాలలోని సంబంధిత శాఖలను సమన్వయం చేసుకొని ఆంటీ లార్వా ఆపరేషన్స్ చేపట్టాలని డెంగ్యూ కేసు నమోదైన ఇంటి చుట్టుపక్కల 50 ఇండ్లలో పైరిత్రం స్ప్రే చేయాలని, నీరు నిలువ ఉన్న ప్రాంతాలలో ఆయిల్ బాల్స్ వేయాలని, సాయంత్రం వేళ ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.వ్యాధి నమోదు అయిన ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, సిబ్బంది ఇంటింటి జర సర్వే నిర్వహించాలని, వ్యాధి లక్షణాలతో ఉన్న వారి నుండి రక్తనామానాలను సేకరించాలని తెలిపినారు.జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండి తగు సేవలు అందించాలని తెలిపినారు. ప్రతిరోజు సబ్ సెంటర్ల నుండి అన్ని మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి వ్యాధిగ్రస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపినారు.ఎవరైనా తమ విధులను నిర్లక్ష్యం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపినారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్ కె వెంకటరమణ డాక్టర్ లలిత దేవి మాట్లాడుతూ ప్రజలకు వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ దోమలు పుట్టకుండా కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వ్యాధులకు గురికాకుండా ఉండాలని తెలిపినారు.ఎవరికైనా వ్యాధి లక్షణాలు గనుక ఉన్నట్టయితే వెంటనే వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ద్వారా రక్త పరీక్షలు చేసుకొని తగు చికిత్సలు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరినారు.ప్రజలు స్వచ్ఛందంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రతగా ఉంచుకొని పరిశుభ్రమైన నీటిని తాగాలని నిలువ ఉన్న ఆహారాన్ని భుజించరాదని వేడి ఆహార పదార్థాలను భుజించాలని తెలిపినారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య ఎంటమాలజీ టీం ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ పద్మశ్రీ. డాక్టర్ మదన్ మోహన్ ,డిప్యూటీ డిఎంహెచ్ఓలు డాక్టర్ గోపాలరావు,డాక్టర్ ప్రకాష్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మోహన్ సింగ్, డెమో అశోక్ రెడ్డి, డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ఇన్చార్జి ఏ ఎమ్ ఓ శ్రీనివాస్, సబ్ యూనిట్ ఆఫీసర్లు ,ఆరోగ్య పర్యవేక్షకులు, ఎంజీఎం ల్యాబ్ సిబ్బంది, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Most Popular