Saturday, November 9, 2024

E-Paper

Homeతెలంగాణకేసిఆర్ తో నే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోపాటు అభివృద్ది జరిగింది. మాజీ మంత్రి హరిష్ రావు

కేసిఆర్ తో నే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోపాటు అభివృద్ది జరిగింది. మాజీ మంత్రి హరిష్ రావు

ఆయుధం సిద్దిపేట
సిద్దిపేట జిల్లా కేంద్రం లోని బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పార్టీ జెండాను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అవిష్కరించారు.ఈ సందర్బంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ 2001 ఏప్రిల్ హైదరాబాద్ జలా దృశ్యం తో ప్రారంభమైన గులాబీ జెండా ప్రస్తానం. నేడు దేశానికి ఆదర్శం అయిందన్నారు.కేసిఆర్ అనాడు కొనాయి పల్లి వెంకట్టేశ్వర ఆలయంలో పూజలు చేసి డిప్యూటి సిఎం పదవికి ఎమ్మేల్యేకు టిడిపి పార్టీ సభ్యత్వనికి మూడింటికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమం ప్రారంభించారని కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. మన పథకాలను కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసింది రైతు బంధు పథకాన్ని కేంద్రంలో బీజేపీ కాపీ కొట్టి అమలు చేశార పేర్కొన్నారు. కేసీఆర్ తొ అభివృద్ధి ఆదర్శం ఉంటే, రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నరిని తెలిపారు.ఇచ్చిన హామీలు అమలు చేయాలని నేను రాజీనామా చేస్తానని తెలిపారు.ఉద్యమ సమయంలో నాడు రాజీనామా చేయకుండా ఉన్న వ్యక్తి కిషన్ రెడ్డి. రాజీనామా కోసం జిరాక్స్ పేపరు ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి, తప్పించుకొని తిరిగిన వ్యక్తి కిషన్ రెడ్డి చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నేను రాజీనామా కు సిద్ధంగా ఉన్నాను.స్పీకర్ పార్మట్ లో ప్రెస్ అకాడమీ చెర్మెన్ శ్రీనివాస్ రెడ్డి కి పంపించు, నేను ఐదునిముషాల్లో పంపిస్తానని నాకు పదవులు ముఖ్యం కాదు రైతులు, ప్రజల ప్రయజనాలు ముఖ్యమని తెలిపారు. నాడు ఓటు కు నోటు, నేడు దేవుళ్లపైన ఒట్లు పెట్టుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డిని ఆగస్టు 15 లోపు రుణమాఫీ, గ్యారెంటీ లు అమలు చేస్తావో లేదో చెప్పు రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.

Most Popular