ఆయుధం హన్మకొండ
వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్వర్యంలో జూన్ 8న శనివారం నాడు జాతీయ లోక్ అదాలత్ ను వరంగల్ జిల్లా కోర్టులోనర్సంపేట మండల కోర్టులో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వరంగల్ జిల్లా ఇంఛార్జి ప్రధాన న్యాయమూర్తి జి.ప్రేమలత తెలిపారు కక్షిదారులు తమ వీలును బట్టి తమ కేసులను రాజీ కుదుర్చుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ , కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, కన్సూమర్ ఫోరమ్ కేసులు, ట్రాఫిక్ ఈ-ఛాలన్ కేసులు , ప్రీ- లిటిగేషన్ కేసులు, ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరుయై తమ తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్దం కావాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగు కక్షిదారులు తమ తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరిచి, రాజీ కుదుర్చుకుని, కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలని తెలియజేశారు. రాజీపడదగు కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టులకు నేరుగా హాజరు కావాలని తెలియజేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయుటకు గాను ఇప్పటికే పోలీసు అధికారులతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతోనూ, ఎక్సైజ్ శాఖ అధికారులతో, ఇన్సూరెన్స్ అధికారులతోనూ, న్యాయవాదుల తోనూ, బ్యాంకు మరియు చిట్ ఫండ్ మేనేజర్లతో వేరు వేరు సమావేశాలు నిర్వహించి, అధిక కేసుల పరిష్కార దిశగా చర్యలు చేపట్టాం అని తెలిపారు. ఇప్పటివరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ లో గుర్తించబడిన కేసులలో మొత్తం 829రాజీపడదగు పెండింగ్ కేసులలోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశాం. వీటిలో క్రిమినల్ – 719, ఎన్.ఐ.యాక్ట్ – 14, ఎం.ఎ.సి.టి.- 47, అదర్ సివిల్ -49, మరియు ప్రీ-లిటిగేషన్ ఎలక్ట్రిసిటి కేసులు- 800, బ్యాంక్ కేసులు – 150, బి.ఎస్.యన్.ఎల్. కేసులు-301. అని తెలిపారు. కక్షిదారులు తమ వీలును బట్టి తమ కేసులను తేదీ:14:05:2024 నుండి తేదీ:07:06:2024 రోజు సాయంత్రం 5.00గంటల లోపు ఏ రోజైనా రాజీ కుదుర్చుకునేలా ప్రీ-లోక్ అదాలత్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ప్రీ-లోక్ అదాలత్ లో ప్రీ- లిటిగేషన్ కేసులు, ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ జాతీయ లోక్ అదాలత్, ప్రీ-లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైననూ, సందేహాలకైననూ, ఏదేని న్యాయసహాయం కొరకు అయిననూ న్యాయసేవాధికార సంస్థ ను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవలని కక్షిదారులకు సూచించారు.