ఆయుధం వరంగల్
కడియం శ్రీహరి రాజకీయం విలువలు లేని రాజకీయాలు నడుపుతున్నారని స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తున్నారని మళ్ళీ తనే విలువలు గల వ్యక్తిని చెప్పి బాకాలు ఊదుకుంటున్నాడు కడియం శ్రీహరికి వరంగల్ ప్రజలు గుణపాఠం నేర్పవలసిన అవసరం ఉన్నదని పార్టీ మారిన వ్యక్తి రాజీనామా చేయలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. హనుమకొండ లోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కోసమే తన కుటుంబం కోసమే రాజకీయాలు చేస్తుంటాడని తానే విలువలు గల నాయకుడని అంటుంటాడని ఆయన అన్నారు తనకు తానే భజన చేసుకుంటాడని తెలిపారు. నేను అడుగుతున్న సూటిగా మీకు విలువలు ఉంటే విలువలు గల రాజకీయం చేస్తుంటే మీరు ఏ పార్టీ నుంచి అభ్యర్థిగా గెలిచావు ఆతదుపరి ఏ పార్టీలో చేరావు, బీఆర్ఎస్ పార్టి నుండి గెలిచినావు ఆపార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విలువల గురించి మాట్లాడాలని ఆయన కడియం ను సూటిగా ప్రశ్నించారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రస్తుతం నీ పార్టీ కాంగ్రెస్ లో ఉన్న రాజగోపాల్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకోవాలి ఈటల రాజేందర్ ని ఆదర్శంగా తీసుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే విలువలు ఉంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కారణాలు ఏమైనా కేసీఆర్ ఓడించే ప్రయత్నంలో ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరితే తాను గెలిచిన పార్టీ నుంచి మరో పార్టీల చేరినప్పుడు ఆ పార్టీ ద్వారా పొందిన పదవులకు రాజీనామా చేసి మునుగోడులో పోటీ చేసిన నైతిక విలువలు గల వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని అన్నారు. హుజురాబాద్ నుంచి ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ లో ఉండి టిఆర్ఎస్ తోనే గెలిచిన ఈటల రాజేందర్ తాను పార్టీ మారాలనుకున్నప్పుడు ముఖ్యంగా కేసీఆర్ గతంలో రాజన్నను అవమానపరిచి బర్తరప్ చేసినప్పుడు ఈటలు రాజేందర్ కూడా బర్తరప్ చేస్తే తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం తన వ్యక్తి త్వాన్ని చాటుకోవడం కోసం టిఆర్ఎస్ పార్టీలో ఉండలేని పరిస్థితులు వచ్చినప్పుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి పార్టీలో చేరారని అన్నారు,. కడియం శ్రీహరికి వ్యక్తిత్వం ఉంటే నీవు విలువల గల రాజకీయ నాయకుడైతే నువ్వు ఎందుకు పారిపోతున్నావని నీకేం వ్యక్తిత్వం ఉన్నది ముందుగా రాజీనామా చేయాలిని మంద కృష్ణ డిమాండ్ చేశారు. . తాను వ్యక్తిగత రాజకీయాలు చేయడం లేదని అందరూ బాగు కోసమే రాజకీయాలు చేయడం జరుగుతుందని అన్నారు నాకు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ అభ్యర్థులుగా పదవులు ఇస్తామన్నారని తాను వద్దనుకున్నామని అన్నారు. తాను నైతిక విలువలతో గర్వంగా బతుకుతాను అని అన్నారు ఎమ్మార్పీఎస్ లో పనిచేసిన వారు ఏ పార్టీలో ఉన్న వారిని ప్రోత్సహించుకున్నామని అన్నారు. మాదిగలకు ద్రోహం చేస్తున్న వ్యక్తి కడియం శ్రీహరి అని అన్నారు కడియం శ్రీహరీ మాదిగలకు ద్రోహం చేశారని టికెట్ ఇవ్వాలనుకుంటే మీ చేతిలో ఓడిపోయిన ఇందిరకు ఇప్పించేవాడివే కదా ఎందుకు ఇప్పి ఇప్పించలేదని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ మూడు కుటుంబాలకే మేలు చేసిందని మాదిగలకు మీరు చేయలేదని అన్నారు. మూడు కుటుంబాల కోసం మాదిగలను ద్రోహం చేసిందని అన్నారు కడియం శ్రీహరి కుటుంబం వివేక్ కుటుంబం మల్లు భట్టి విక్రమార్క కుటుంబంకు ఈ మూడు కుటుంబాలు మాదిగ జాతికి ద్రోహం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో మూడు పార్లమెంట్ సీట్లలో కంటోన్మెంటు ఉప ఎన్నికల్లో మాదిగలకు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ చేసిందని అన్నారు షెడ్యూల్ కులాలలో మాదిగలు లేనట్టుగా చేస్తున్నారని షెడ్యూల్ కులాలలో మాదిగలు లేరని ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఇది న్యాయమేనా అనే సూటిగా కాంగ్రెస్ ఉన్నతశ్రేణి నాయకులను ప్రశ్నించారు.