Saturday, November 30, 2024

E-Paper

Homeజాతీయంజాతీయస్థాయి ఇన్స్ పైర్ ఎగ్జిబిషన్ కు ఎంపికైన నెక్కొండ విద్యార్థి

జాతీయస్థాయి ఇన్స్ పైర్ ఎగ్జిబిషన్ కు ఎంపికైన నెక్కొండ విద్యార్థి

జాతీయస్థాయి ఇన్స్ పైర్ మనాక్ 2023-24 ఎగ్జిబిషన్ కి వరంగల్ జిల్లా నెక్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి బట్టు నిఖిల్ వర్మ ఎంపికైనాడని వరంగల్ జిల్లా విధ్యాశాఖ అధికారి వాసంతి తెలిపారు. ఈనెల 14,15వ తేదీలలో వర్చువల్ పద్ధతిలో నిర్వహించబడిన రాష్ట్రస్థాయి ఇన్స్ పైర్ ఎగ్జిబిషన్ పోటీలలో జిల్లాస్థాయిలో ఎంపికైన 259 మంది విద్యార్థుల ఎగ్జిబిట్స్ ప్రదర్శింపబడినాయని.ఇందులో 26ప్రదర్శనలను తెలంగాణ రాష్ట్రం తరఫున జాతీయస్థాయిలో పాల్గొనడానికి ఎంపిక చేశారని తెలిపారు. నెక్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న నిఖిల్ వర్మ రూపొందించిన “వాటర్ క్లీనర్ బోట్” ఎగ్జిబిట్ ఎంపికైందన్నారు.ఉమ్మడివరంగల్ జిల్లాల నుండి ఎంపికైన ఏకైక ఇన్స్ పైర్ ప్రాజెక్ట్ నిఖిల్ వర్మ దే కావడం విశేషం.
ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి వాసంతి జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ నెక్కొండ పాఠశాల విద్యార్థి నిఖిల్, గైడ్ టీచర్ విశ్వప్రసాద్, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. నిఖిల్ వర్మ కు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారు జూలై మాసంలో కార్యశాల నిర్వహించి తన యొక్క ప్రాజెక్టును మరింత అభివృద్ధి చెందించడానికి కావల్సిన మేధోసాయం అందించబోతున్నారు. ఆ తదుపరి న్యూ ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ఇన్స్ పైర్ పోటీలలో నిఖిల్ పాల్గొంటారనిడిఈఓ వాసంతి తెలిపారు.

Most Popular