Saturday, November 9, 2024

E-Paper

Homeతెలంగాణతెలంగాణలో 17కు 17 ఎంపీ సీట్లు గెలుచుకుంటామనే నమ్మకంతొ బిజెపి ఫోకస్

తెలంగాణలో 17కు 17 ఎంపీ సీట్లు గెలుచుకుంటామనే నమ్మకంతొ బిజెపి ఫోకస్

తెలంగాణ అభివ్రుద్దికి కేంద్రప్రభుత్వం పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉందనిపది ఏళ్లలో తెలంగాణలో దాదాపు పది లక్షల రూపాయాల కోట్లకుపైగా నిధులిచ్చిందనికేంద్రంలో మోదీని మళ్లీ ప్రధానిని చేస్తే శక్తివంతమైన భారత్ రూపుదిద్దుకుంటుందని కరీంనగర్ఎంపి బండి సంజయ్ కుమార్ అన్నారు.హుజూరాబాద్ లోని జమ్మికుంట మండలం శాయంపేటలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.ప్రజాహిత యాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని ఎక్కడికి వెళ్లినా మోదీకే ఓటేస్తామని చెబుతున్నారనిదేశవ్యాప్తంగా బీజేపీకి 350కిపైగా ఎంపీ సీట్లు వస్తాయి ఆయన అన్నారు. తెలంగాణలో 17కు 17 ఎంపీ సీట్లు గెలుచుకుంటామనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట మేరకు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందిని అన్నారు.తెల్ల రేషన్ కార్డు ఉన్నా వారందరికి .500 రూపాయాలకు గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులో కోత పెడుతున్నరని అందరి అందివ్వాలని డిమాండ్ చేశారు.90 లక్షల రేషన్ కార్డు కుటుంబాలుంటే 50 లక్షల కుటుంబాలకు కోత పెట్టడం అన్యాయమని తెలిపారు.ప్రతినెలా ఉద్యోగులకు జీతాలివ్వకుంటే వాళ్లతో కలిసి సర్కార్ ను నిలదీస్తూనే ఉంటాం కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కై దొంగాట ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నయ్కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కాగ్, విజిలెన్స్ సంస్థలు తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ సైతం 6 గ్యారంటీల హామీల అమలు కోసం నిలదీయలేకపోతోందని పేర్కోన్పారు.హైదరాబాద్ నుండి కరీంనగర్, రామగుండం రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం రక్షణ భూములివ్వడం హర్షణీయమనిరాజకీయాలను పక్కనపెట్టి అభివ్రుద్ధిపై ద్రుష్టి పెడితే కేంద్రం ఏ విధంగా సహకరిస్తుందే ఇదే నిదర్శనం గత బీఆర్ఎస్ సర్కార్ కేంద్రాన్ని తిట్టడానికే పరిమితమైందే తప్ప ఏనాడూ అభివ్రుద్ధిపై దృష్టి పెట్టలేదాన్నారు.ఇకనైనా కేంద్రాన్ని, మోదీని తిట్టడం మానుకుని ప్రజా సమస్యల పరిష్కారం చేయాలని కొరారు.

Most Popular