Friday, November 29, 2024

E-Paper

Homeతెలంగాణపార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కులేదు

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కులేదు

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయకుండా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కులేదని మాజీ మంత్రి హరీష్ అన్నారు.వరంగల్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో హన్మకొండలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాజీమంత్రి దయాకర్ రావు,ఎమ్మేలే పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మేల్సీలు బండ ప్రకాష్ సిరికొండ మధుసూధనాచారి, మాజీఎమ్మేల్యేలు పెద్ది సుధర్శన్ రెడ్డి ,వినయ్ భాస్కర్,,చల్లా ధర్మారెడ్డి, పాల్గొన్నారు బిఆర్ఎస్ నాయకులు కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలుకు మాజీ మంత్రి హరీశ్ రావు హజరై మనోదైర్యం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియం శ్రీహరి పార్టీ నుంచి పోయాక పార్టీలో జోష్ కనిపిస్తోందనిపదవులను, కూతురికి టికెట్‌ను తీసుకుని పార్టీకి ద్రోహం చేసిన శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తోందని అన్నారు.పార్టీ మారేదే లేదని చెప్పిన శ్రీహరి ఎందుకు మారాడో సమాధానం చెప్పాలని, కడియంకు నైతిక విలువలు ఉంటే బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.దొంగలతో కండువా కప్పించుకునే స్థాయికి శ్రీహరి దిగజారుడు అవసరమా? దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతున్నాయి. ఆ పార్టీలోకి శ్రీహరి పోయిండని తెలినారు.కష్టపడే కార్యకర్తలకు తప్పక గుర్తింపు ఉంటుందని ద్రోహం చేసినవాళ్లను మళ్లీ పార్టీలొ చేర్చుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.వరంగల్ తొలి నుంచి ఉద్యమాల గడ్డ. బీఆర్ఎస్‌కు అండగా ఉంది. కార్యకర్తల కాళ్లు కడిగి నెత్తిమీద చల్లుకున్నా తక్కువేఅని అన్నారు.వరంగల్ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసింది. ఐదు మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషల్ పార్టీ, టెక్స్ టైల్ పార్టీ తెచ్చామని అన్ని రంగాలలో అభివృద్ది చేశామన్నారు.రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంలోని కాకతీయ తోరణాన్ని తీసేస్తామని రేవంత్ అంటున్నారు. అదే జరిగితే వరంగల్ అగ్నిగుండమవుతుందని కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుందని, కాకతీయ తోరణం వరంగల్ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకఅని చెప్పారు.రెండు లక్షల రుణమాఫీ, పింఛన్ పెంపు, రైతుబంధు పెంపు, వడ్లకు బోనస్, మహిళలకు 2500.. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదనిఈ హామీలు అమలైన వాళ్లు కాంగ్రెస్‌కు ఓటువేయండి, కానివాళ్లు బీఆర్ఎస్‌కు ఓటేయండని ఒటర్లకు పిలునిచ్చారు.కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దు. కష్టాలు మనకు కొత్తకాదు. రేవంత్ నాయకులను కొనగలడేగాని ఆత్మగౌరవమున్న ఉద్యమ నాయకులను కొనలేడని తెలిపారు.నిరుద్యోగులకు నాలుగు వేల భృతి ఇస్తామని వాళ్లనూ మోసం చేసింది కాంగ్రెస్ అని ఆ హామీనే ఇవ్వలేదని అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అబద్ధమాడిండని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. యాసంగి పంటలను కొనేందుకు కొనుగొలు కేంద్రాలను ఏర్పాటు చేసి వడ్లను రెండువేల ఐదు వందల రూపాయిలు పెట్టి కొన్నాకనే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అడగాలి అన్నారు. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించి చెప్పండి. అన్ని చోట్లా చర్చకు పెట్టండి. కాంగ్రెస్ వచ్చాక ముస్లిం సోదరులకు తోఫా బంద్ అయిందనిమైనారిటీల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో కృషి చేశారు. మీరు బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే అసెంబ్లీలో హామీలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. ప్రశ్నించే బలాన్నిమాకివ్వాల. రేవంత్ పేగులు మెడలో వేసుకోకుండా, పేదలకు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి కొరారు. మానవబాంబులా మారకుండా మానవీయ పాలన అందించాలి.ఆరు నూరైనా, అటు సూర్యుడు ఇటు పొడిచినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ అని అన్నారు

 

Most Popular