Thursday, April 3, 2025

E-Paper

Homeలేటెస్ట్ప్రభుత్వ పాఠశాలల్లోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు

ప్రభుత్వ పాఠశాలల్లోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారు

రాయపర్తి, ఆయుధం: ప్రభుత్వ పాఠశాలల్లోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, చదువులో రాణించి సమాజానికి కీర్తిని తీసుకురావాలని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరిపాటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని తిర్మలాయపల్లి ఎంపీపీఎస్, జడ్పీహెచ్ఎస్ లో గురువారం విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ యూనిఫామ్, టై,బెల్ట్,బ్యాడ్జ్, షూ,అందించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతు చిన్నప్పటినుంచే మంచి లక్ష్యం ఎంచుకొని సాధన కోసం నిర్విరామంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అనిమిరెడ్డి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ లేతాకుల రంగారెడ్డి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు ఎస్టీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేందర్ రాథోడ్ నాయక్ మండల పార్టీ అధికార ప్రతినిధి తాళ్లపల్లి సంతోష్ గౌడ్, స్థానిక మాజీ సర్పంచి గజవెల్లి అనంతప్రసాద్, నాయకులు ఎలమంచి శ్రీనివాస్ రెడ్డి,కర్ర రవీందర్ రెడ్డి, బద్దంవేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఐతరాంచందర్, మాజీ సర్పంచ్ వశపాక కుమారస్వామి, నాయకులు సంది దేవేందర్ రెడ్డి, చందు రాము, ఎల్లస్వామి, చందు సతీష్, ఎం డి యూసుఫ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Most Popular