Saturday, November 30, 2024

E-Paper

Homeలేటెస్ట్ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ

ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ

ఆయుధం హనుమకొండ:- హనుమకొండ లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలను వైద్యులు సిబ్బంది అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఇన్ పేషంట్, ఔట్ పేషంట్, నవజాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవల గదులతోపాటు ల్యాబ్ ను కలెక్టర్ పరిశీలించారు. వైద్య సేవలకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. సమీకృత సలహా పరీక్ష(ఐసీటీసీ) కేంద్రాన్ని, అదేవిధంగా ఆసుపత్రిలోని హెచ్ఐవి టెస్ట్ సెంటర్ను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలోని ఐపి, ఓపీ సంఖ్యను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు బాలింతలు నవజాత శిశువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలను అందించాలన్నారు. ఆసుపత్రిలో ఏవైన ఇబ్బందులు ఉంటే పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో వర్తించే వివిధ జబ్బులకు సంబంధించిన వివరాలతో కూడిన జాబితాను ప్రదర్శించేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు ఆటోమెటిక్ గా జనరేటర్ లు పనిచేసేటట్టు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి,తదితర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

Most Popular