Saturday, November 30, 2024

E-Paper

Homeతెలంగాణబయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే

బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే

నిర్దేశిత గడువులో బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని బల్దియా కమీషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాంపూర్ డంపింగ్ యార్డు యందు క్షేత్ర స్థాయి లో పర్యటించి కొనసాగుతున్న బయోమైనింగ్ ప్రక్రియను కమీషనర్ పరిశీలించారు.ఈ సందర్భం గా కమీషనర్ మాట్లాడుతూ జూన్ మాసాంతానికి బయోమైనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, 3 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు లక్ష 87 వేల మెట్రిక్ టన్నుల చెత్త ప్రాసేసింగ్ మాత్రమే పూర్తి చేయడం జరిగిందని, ప్రతిరోజు 2 మెట్రిక్ టన్నుల చొప్పున లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళిక బద్ధం గా వ్యవహరిస్తూ గడువులోగా పూర్తి చేయాలని, ప్రతిరోజు పూర్తి చేసిన చెత్త ప్రాసెసింగ్ సంబంధిత సమాచారాన్ని అందజేయాలని, బల్దియా వ్యాప్తంగా ఉన్న 66 డివిజన్ ల నుండి చెత్తను సేకరించి డంప్ యార్డ్ కు తరలించే క్రమం లో రోడ్డు పైన చెత్త పడకుండా వుండేలా వాహనాల పైన కవర్లను ఏర్పాటు చేసేలా చూడాలని ముఖ్య ఆరోగ్యాదికారిని ఆదేశించారు కమిషనర్ వెంట ముఖ్య ఆరోగ్య అధికారి డా. రాజేష్, ఎస్ ఇ ప్రవీణ్ చంద్ర, ఈ ఈ లు రాజయ్య, సంజయ్ కుమార్,స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి,సానిటరీ సూపర్వైజర్ పసునూరి భాస్కర్ సానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

 

Most Popular