రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ మురళీధర్ రావు దంపతులను హన్మకొండ రాంనగర్ లోని వారి నివాసంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , డాక్టర్ కడియం కావ్య మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి కొండా దంపతులు రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో పార్టీ అభివృద్ధితో పాటు జిల్లా అభివృద్ధికి కలిసి ముందుకు వెల్దామని చర్చించారు.