Saturday, November 30, 2024

E-Paper

Homeతెలంగాణబీఆర్ఎస్ పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి క్లారిటి

బీఆర్ఎస్ పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి క్లారిటి

ఆయుధం వరంగల్
బిఆర్ఎస్ లోనే ఉంటాను – మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తాను పార్టీ మారడం లేదని రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. తాను బిజెపి లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టి పారేశారు.నా పైన కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పని చేస్తాను. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్, పాలకుర్తి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని బలాహీనపర్చాలని కావాలని కొందరు ఇలాంటి దుష్ప్రచారం నాపైన చేస్తున్నారని ఆయన అన్నారు. కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు చేసే దుష్ప్రచారాలని నమ్మవద్దు అని ఆయన తెలిపారు.

Most Popular