Saturday, November 9, 2024

E-Paper

Homeతెలంగాణమాదిగల ఎదుగుదలకు అడ్డంకి కడియం శ్రీహరి

మాదిగల ఎదుగుదలకు అడ్డంకి కడియం శ్రీహరి

వరంగల్ ఉమ్మడి జిల్లాలో మాదిగల ఎదుగుదలను అడుగడుగునా అడ్డుకుంటున్నది మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వరంగల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా ఆయన మాదిగ అని నమ్మిస్తూ రాజకీయాలు చేశాడని.. మాదిగ ఉపకులం బైండ్ల కులానికి చెందిన కడియం శ్రీహరి తన రాజకీయ ఎదుగుదలకు మాదిగ కులాన్ని ఉపయోగించుకుని.. రాజకీయంగా ఎదిగాడని, గత 40 ఏళ్లుగా తన ఎదుగుదలకు నిరంతరం మాదిగ జాతిని ఉపయోగించుకొని అదే మాదిగల నుంచి ఎదుగుతున్న వారిని ఆయన అడుగడుగునా అడ్డుకుంటూ వస్తున్నాడని తెలిపారు. ఆయన రాజకీయ జీవితంలో ఏ ఒక్క మాదిగ బిడ్డను రాజకీయంగా ఎదుగుదలకు ప్రోత్సహించలేదని, నాటి తెలుగుదేశం నుంచి నేటి బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు మాదిగలు ఎంతో సహకరించారని అన్నారు. ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎమ్మెల్సీ వరకు, ఎంపీగా డిప్యూటీ సీఎంగా ఎదిగానని వారి ప్రొత్సాహంతోనే నేను అని గట్టిగా చెప్పే దమ్ము ధైర్యం ఆయనకు లేదని అన్నారు. ఆయన ప్రోత్సాహానికి సంబంధం లేకుండా ఆయన సహకారం లేకున్నా.. ఆయన ప్రోత్సహం లేకున్నా.. ఆయన అండదండ లేకున్నా ఒక మాదిగ కులం నుంచి ఒక ముగ్గురు రాజకీయంగా ఎదిగారని అన్నారు. స్టేషన్ గణపురం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ పార్లమెంటు సభ్యుడు పసునూరి దయాకర్  వారి రాజకీయ జీవితాన్ని అణగదొక్కారని అన్నారు. మాదిగల ఎదుగుదలకు సహకరించని కడియం శ్రీహరి కూతురు కావ్య కు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకూడదని ఆయన మాదిగలకు పిలుపునిచ్చారు. కడియం శ్రీహరికి నరనరాన ఒకర్ని ఎదుగుదల జీర్ణించుకోలేరని అన్నారు. ఎమ్మార్పీఎస్ నుంచి పనిచేసిన వారందరూ రాజకీయంగా ఎంతో ఎదిగారని ఆయన అన్నారు. మాదిగ రిజర్వేషన్ల అమలు కోసం పాటు పడుతున్నది ప్రధాని నరేంద్ర మోడీ అని మందకృష్ణ మాదిగ తెలిపారు.

Most Popular