Saturday, November 30, 2024

E-Paper

Homeజాతీయంమూడు నెలలో బిఆర్ఎస్ పార్టీ మూత పడుతుంది. కడియం శ్రీహరి

మూడు నెలలో బిఆర్ఎస్ పార్టీ మూత పడుతుంది. కడియం శ్రీహరి

ఆయుధం వరంగల్
కాకతీయుకాలం నాటి చరిత్ర కల్గిన వరంగల్ ను జిల్లా ఏర్పాటు పేరుతో జిల్లాను ఆరు ముక్కలు చేసింది కేసీఆర్ అని ఎం ముఖం పెట్టుకొని వరంగల్ కి వచ్చావని మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరిఅన్నారు. సోమవారంనాడు హన్మకొండలో జరిగిన వరంగల్ ఖమ్మ నల్లగొండ పట్టబద్రుల ఎన్నికల సన్నహక సభలో కడియం శ్రీహరి మాట్లాడుతూ కేసిఆర్ మూడు నెలలో తెలంగాణలో అద్బుతం జరగబోతుందని అంటున్నాడని అవినీతికి కారకులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు మూడు నెలల్లో ఏదో అద్భుతాలు జరగబోతుంది అని చెబుతున్నాడని రాష్ట్రంలో పదిహెడు లోకసభ ఎన్నికలు జరగబోతున్నాయి ఏ ఒక్క లోకసభ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ గెలవడం లేదు మూడు నెలల తర్వాత బిఆర్ఎస్ పార్టీ మూత పడబోతుందని అదే అద్భుతమని కడియం శ్రీహరి అన్నారు చివరికి మెదక్ లోగెలిచే పరిస్థితి లేదు. ఓటింగ్ శాతం 20 శాతానికి బిఆర్ఎస్ పార్టీది పడిపోయిందని, బిజెపిది ఇరువైఐదు శాతం నుంచి మూప్పై శాతంకు వస్తే బీఆర్ఎస్ మూప్పై శాతం నుంచి ఇరువై శాతంకు పడిపోయింది తెలిపారు. కనీసం రెండో స్థానం కోసం కొట్లాడె పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీ లేదని రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బిజెపికి మధ్యనే పోటీ ఉంటుంది బిఆర్ఎస్ చాలా చోట్లలో మూడో స్థానానికి కొన్ని చొట్ల డిపాజిట్ కూడా దక్కకపోవచ్చని అన్నారు. కేసీఆర్ మూడు నెలల్లో జరుగుతున్నది అబ్దుతం కాదని మీ పార్టీ మాయం అయ్యె పరిస్థితి ఉందన్నారు. నా పై వ్యక్తిగత విమర్శలు మాని ముందుగా మీ పార్టీని కాపాడుకొనే ప్రయత్నం చేయండని సూచించారు.

Most Popular