ఆంద్రప్రదేశ్ అధికార పార్టీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శనివారం నాడు హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు. మైలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్యనాయకులు, అనుచరులతో కలిసి కృష్ణ ప్రసాద్ తెలుగు దేశం పార్టీలో చేరారు. చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి కృష్ణ ప్రసాద్, ఎంపిపిలు ఎంపిటిసి సభ్యులు సర్పంచులు ఆయన అనుచరులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రానున్న కాలంలో టిడిపి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గం అభివృద్ది కొసం టిడిపి పార్టీలొ చేరామని చెప్పారు.