సిఎం రేవంత్ రెడ్డి వరంగల్ లో జరిగిన సభల హరీష్ రావు నీ రాజీనామా లేటర్ జెబులో పెట్టికొఅని సిఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కుసిఎం మాటలకు స్పందించి నేడు హైదరాబాద్ లో గన్ పార్కు వద్దకు రాజీనామా లేఖతో వచ్చారు నేను వచ్చిను మీరు ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే సిఎం మీ రాజీనామాను గవర్నరుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.మెదక్‌లో మాజీమంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న ఆయన హామీల అమలుపై రేవంత్‌రెడ్డి అమరవీరుల స్తూపం వద్దకు రావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ హరీశ్‌రావు రాజీనామా పత్రంతో అమరవీరుల స్తూపం వద్దకు వచ్చారు.సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించి తాను రాజీనామా పత్రంతో వచ్చానని హరీశ్ రావు అన్నారు. దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసగించే యత్నం జరుగుతుందని ఆరోపించారు. ప్రజలకు రేవంత్ ఇచ్చిన హామీలు నిజమైతే గన్‌పార్క్ వద్దకు రావాలని డిమాండ్ చేశారు.మేధావుల చేతుల్లో ఇద్దరి రాజీనామా పత్రాలు పెడదామని అన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేయాలని, ఒకవేళ హామీలు అమలు చేస్తే తన రాజీనామా లేఖ స్పీకర్‌కు ఇస్తానని చెప్పారు. చేయకపోతే రేవంత్‌రెడ్డి రాజీనామా లేఖ గవర్నర్ ఇవ్వాలని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయించడమే తమ కర్తవ్యమని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.