ఆయుధం: వరంగల్
వరంగల్ ఎంపీ లోకసభ అభ్యర్థిగా పెద్ది స్వప్నను పోటీకి దింపాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. అదే నిజమైతే త్వరలోనే అమె అభ్యర్థిత్వన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ మొదట స్టేషన్ ఘనపురం ఎమ్మేల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను ఎంపిక చేసింది. నేను బీఆర్ఎస్ నుంచి పపోటీనుంచి తప్పుకుంటు తన తండ్రి కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళి అభ్యర్ధి ఎంపిక కొసం వేట మొదలు అయింది. ఇటివల హన్మకొండలో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంకు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హజరైనారు. పార్లమెంట్ స్థాయి సమావేశంలో హజరైన ఎమ్మేల్యే, ఎమ్మేల్సీలు , మాజీ ఎమ్మేల్యేలు హజరైనారు. టికెట్ ఖారారు అయి అభ్యర్థిగా కడియం కావ్య పేరు ప్రకటించిన తరుపరి కావ్య కారుదిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీని కాదని పోయిన కావ్యను ఓడించాలంటే బలమైన అభ్యర్థిని బీఆర్ఎస్ తరుపున దింపాలని హజరైన కార్యకర్యలు నాయకులు కొరారు.దీంతొ పార్టీలొ మొదటి నుండి పనిచేస్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డి సతిమణి పెద్ది స్వప్న పేరు ఎంపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చింది. ఉద్యమకారుడు పెడ్డి సుదర్శన్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా నాటి టిఆర్ఎస్ పార్టీకి అద్యక్షుడుగా పనిచేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజకర్గం పరిధిలో అందరికి సుపరిచయాలు ఉన్ప పెద్ది సుదర్శన్ రెడి సతిమణికే టికెట్ ఇవ్వాలని ఆపార్టీ అదిష్టానం నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది. పెద్ది స్వప్న ఉద్యమకాలంలో తెలంగాణ సాధనకొసం పనిచేసిన అనుభవం ప్రస్థుతం వరంగల్ జిల్లా జడ్పీటీసి కొనసాగుతూ జడ్పీ ప్లోర్ లీడర్ గా ఉన్నారు. ప్రజా సమస్యలపై అవగాన ఉంది. పెద్ది స్వప్ప పేరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో బిజెపి నుండి ఆరూరి రమేష్ . కాంగ్రెస్ నుండి కడియం కావ్య మధ్య ట్రైయాంగిల్ పోటి ఉంటుంది.