Saturday, November 9, 2024

E-Paper

Homeతెలంగాణవరంగల్ నగర పారిశుద్ధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ: బల్దియా ఇన్చార్జి కమిషనర్ రాధిక గుప్తా

వరంగల్ నగర పారిశుద్ధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ: బల్దియా ఇన్చార్జి కమిషనర్ రాధిక గుప్తా

వరంగల్ ఆయుధం
పారిశుద్ధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ అవసరం అని బల్దియా ఇన్చార్జి కమిషనర్, వరంగల్ అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు.శనివారం గ్రేటర్ వరంగల్ మునిసిఫల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలో శానిటేషన్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్చార్జి కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించడానికి తగు సూచనలు చేశారు.ఈ సందర్భంగా బల్దియా వ్యాప్తంగా నిర్వహిస్తున్న శానిటేషన్ విధానాలను ముఖ్య ఆరోగ్యాధికారి ఇన్చార్జి కమిషనర్ కు వివరించారు. అనంతరం ఇన్చార్జి కమిషనర్ మాట్లాడుతూ రాబోవు పది రోజుల్లో సానిటేషన్ ను పక్కాగా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రతిరోజు కనీసం రెండు వార్డుల్లో శానిటేషన్ క్షేత్ర స్థాయి పరిశీలనతో పాటు పన్నుల పురోగతి, నీటి సరఫరా తీరును కూడా పరిశీలిస్తానని, రాబోవు పది రోజుల్లో కనీసం మూప్పై డివిజన్ లలో పర్యటనలు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు.మేడారం జాతర శానిటేషన్ నిర్వహణకు బల్దియా నుండి పారిశుధ్య సిబ్బందిని పంపించడం జరుగుతుందని,యాబై సంవత్సరాలపై బడిన సిబ్బందికి మినహాయింపుతో పాటు ఆరోగ్య సంబంధ సమస్యలు ఉన్న సిబ్బందిని తీసుకువెళ్లవద్దని అధికారులకు సూచించారు.ఈ సమావేశం లో అదనపు కమిషనర్లు అనిసుర్ రషీద్, రవీందర్ యాదవ్, సి ఎం హెచ్ ఓ డాక్టర్ రాజేష్, సానిటరీ సూపర్వైజర్లు సాంబయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు

Most Popular