వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థిగా హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ముందుగా మాజీ డిప్యూటి సిఎం తాటికొండ రాజయ్యపేరు తెరమీదికి వచ్చిన ఆయనకే అవకాశాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి వెళ్లి పోయిన వారిని తీసుకొము అని ఇటివల ప్రకటించారు. అందులో భాగంగా ఆయనకు అవకాశం కల్పించలేదని పార్టీ నాయకులు అంటున్నారు. ఎవరు ఉహించని విధంగా ఒక ఉద్యమకారిడికి అవకాశం కల్పించడం పట్ట బీఆర్ఎస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ ప్రకటించారు. హన్మకొండ జిల్లా వాసి,మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడిగా, పార్టీ కి విధేయుడుగా, అధినేత తో కలిసిపనిచేస్తున్న సుధీర్ కుమార్ సరైన అభ్యర్ధిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనలమేరకు అధినేత కేసీఆర్, సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు.