ఆయుధం వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోశానిటేషన్ నీటి సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు.మంగళవారం వరంగల్ లోని పోతన ట్రాన్స్ఫర్ స్టేషన్ తో పాటు వరంగల్ నగర పరిధిలోని పలు ప్రాంతాలలో నీటి సరఫరా సానిటేషన్ స్థితిగతులను కమీషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.వరంగల్ బ్యాంక్ కాలనీ ప్రాంతం లో పర్యటించి స్థానికులను నీటి సరఫరా తీరు ను అడిగి తెలుసుకుంటూ ప్రతిరోజు ఎంతసేపు నీరు సరఫరా అవుతుంది ? నీటి సరఫరా తీరును అధికారులు పర్యవేక్షిస్తున్నారా? నీటి పన్నులు చెల్లించారా?అని క్షేత్ర స్థాయి స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంత పరిధి లోని ఈఎస్ఎల్ఆర్ కు ఎన్ని నల్లా కనెక్షన్ లు ఉన్నాయని ఏ ఈ ని అడుగగా సుమారు 3 వేలు ఉన్నాయని తెలుపగా, సానిటేషన్ పర్యవేక్షణలో భాగంగా ఇదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది తో మాట్లాడిన కమిషనర్ ఉదయం ఎన్ని గంటలకు విధులకు హాజరవుతారని ?అడిగి తెలుసుకున్నారు,అనంతరం దేశాయి పేట గొల్ల వాడ లో పర్యటించి నీటి సరఫరా విధానాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు.ఎల్ బి నగర్ పద్మనగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా తీరు ను స్థానికులను అడిగి తెలుసుకొని నీటి వృధా ను అరికట్టాలని, అవసరాల మేరకు నీటిని వినియోగించుకోవాలని ఆన్ ఆఫ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని, లైన్ మెన్ లు ఎప్పటికపుడు లీకేజీలను అరికట్టెలా చూడాలని ఈ సందర్భం గా కమీషనర్ అన్నారు.కమిషనర్ వెంట ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర సి ఎం హెచ్ ఓ డా.రాజేష్ ఈ ఈ శ్రీనివాస్ సానిటరీ సూపర్వైజర్ సాంబయ్య డిఈ లు సారంగం రంగారావు కృష్ణమూర్తి రవీందర్ ఏఈలు సౌజన్య సతీష్ సానిటరీ ఇన్స్పెక్టర్లు శ్యామ్ రాజ్ ధరమ్ సింగ్ ఎల్లాస్వామి తదితరులు ఉన్నారు.