Friday, November 29, 2024

E-Paper

Homeలేటెస్ట్నేడే ఆదిత్య ఎల్1 ప్రయోగం..

నేడే ఆదిత్య ఎల్1 ప్రయోగం..

  • చంద్రయాన్-3 విజయంతో ఇస్రోలో రెట్టించిన ఆత్మవిశ్వాసం
  • 120 రోజుల ప్రయాణం తర్వాత సూర్యుడికి సమీపంగా ఉపగ్రహం
  • 15 లక్షల కి.మీ. దూరంలోని సూర్యుడిపైకి తొలిసారి ఉపగ్రహం
  • ఐదేళ్ల పాటు సౌర మండలంలో ఉండి పరిశోధనలు

చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత ఇస్రో చేపట్టిన మొదటి ప్రయోగం ఆదిత్య-ఎల్ 1. అంతేకాదు, సూర్యుడిపైకి మొదటిసారి ఇస్రో పంపుతోన్న ఉపగ్రహం కూడా. దీంత ఈ ప్రయోగాన్ని కూడా విజయవంతం చేయాలని ఇస్రో భావిస్తోంది. ఇక శాస్త్రవేత్తల ప్రయత్నంతో పాటు దేవుడి ఆశీస్సులు కూడా తోడవ్వాలని తిరుమల శ్రీవారి ఆలయం, సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శనివారం ఉదయం సరిగ్గా 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సీ 57 రాకెట్ ఆదిత్యను తీసుకెళ్లనుంది.

చంద్రయాన్‌-3 విజయం ఇచ్చిన ఉత్సాహంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తొలిసారిగా సూర్యుడిపైకి ఆదిత్య-ఎల్1 పేరుతో ఓ ఉపగ్రహాన్ని పంపుతోంది. ఈ ప్రయోగానికి తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ వేదిక కానుంది. సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ-సీ57 (PSLV-C57)ద్వారా పంపుతోంది. ఇందుకు సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం 11.10 గంటలకు ప్రారంభమైన 24 గంటల 40 నిమిషాల కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. కౌంట్‌డౌన్ పూర్తయిన తర్వాత సరిగ్గా ఉదయం 11.50 గంటలకు ఆదిత్య-ఎల్‌1 నింగిలోకి దూసుకెళ్లనుంది.

ఆదిత్య L1 మిషన్ యొక్క ప్రొపల్షన్ మాడ్యూల్ భూమి నుండి దాదాపు 1.5 మిలియన్ కిమీల దూరం ప్రయాణించి సూర్యునికి సమీపంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ 1కి చేరుకోవడానికి దాదాపు 125 రోజులు పడుతుంది.

చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపై మైలురాయిని తాకిన కొద్ది రోజుల తర్వాత, ఇప్పటివరకు నాలుగు దేశాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి.సూర్యుడిని అధ్యయనం చేయడానికి అంతరిక్ష ఆధారిత మొదటి అబ్జర్వేటరీని నిర్వహించడానికి, ఇస్రో ఈ రోజు ఉదయం 11:50 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట లాంచ్‌ప్యాడ్ నుండి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV)-C57 ఉపయోగించి మిషన్‌ను ప్రయోగించనుంది.

ఆదిత్య L1 ప్రొపల్షన్ మాడ్యూల్ దాదాపు 125 రోజుల్లో 1.5 మిలియన్ కి.మీ దూరాన్ని అధిగమించి భూమి మరియు సూర్యుని మధ్య ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ 1కి చేరుకుంటుంది.మొత్తం ఏడు పేలోడ్‌లతో కూడిన పీఎస్‌ఎల్‌వీ-సీ57 శనివారం ఉదయం 11:50 గంటలకు బయలుదేరుతుంది. ప్రయోగం యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్‌తో పాటు దాని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో చూడవచ్చు.

ఆదిత్య ఎల్‌1 ప్రత్యేకతలు ఇవే.

సూర్యుడిపై ప్రయోగాలు చేసేందుకు ఇస్రో చేపడుతోన్న తొలి మిషన్‌ ఇదే.

ఇందులోని శాటిలైట్‌ బరువు సుమారు 1500 కిలోలు ఉంటుంది.

భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రాంజ్‌ పాయింట్‌1 చుట్టూ ఉన్న కక్ష్యలో ఈ శాటిలైట్‌ను ప్రవేశపెడతారు.

ఇందులో మొత్తం ఏడు పేలోడ్లను ఏర్పాటు చేశారు. వీటి సహాయంతో సూర్యుడిలోని ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, వెలుపల ఉండే కరోనాను అధ్యయనం చేస్తారు…!!

Most Popular