Saturday, November 30, 2024

E-Paper

Homeలేటెస్ట్చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల అరెస్టు

చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగల అరెస్టు

రెండు వేర్వేరు సంఘటనల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనాలు, తాళం వేసి వున్న షటర్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సిసిఎస్, మట్వాడా, సుబేదారి పోలీసులు సంయుక్తంగా కల్పి అరెస్టు చేసారు. వీరి నుండి తొమ్మిది ద్విచక్రవాహనాలు, ఒక లక్ష అరువై వేల రూపాయల నగదు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ అరెస్టుకు సంబంధించి క్రైమ్స్ ఏసిపి మల్లయ్య వివరాలను తెలియజేస్తూ, మాట్వాడా పోలీసులు అరెస్టు చేసిన వరంగల్ పోచమ్మమైదాన్, చెందిన బరిపట్ల స్థాయి, వయస్సు 30 సంవత్సరాలు, మద్యంతో పాటు చేడు. వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో గతంలో వరంగల్ పోలీస్ కమికషనరప్ పాటు మహబూబాబాద్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడిపై గతంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో పీడీ యాక్ట్ నమోదు. చేయడం జరిగింది. నిందితుడు గత సంవత్సరం ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీకి పాల్పడిన సంఘటన పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం సంవత్సరంలో జూన్ మాసంలో నిందితుడు, జైలు నుండి విడుదలయినాడు. జైలు జీవితం అనంతరం కూడా నిందితుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పాటు మరో మారు పార్కింగ్ చేసి వుంచిన ద్విచక్రవాహనాలతో పాటు, తాళం వేసి వున్న పానోపులో చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడు మట్వాడ, ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు చొప్పున, హనుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడటంతో సుబేదారి, మామూనూర్, హనుమకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు తాళం వేసి వున్న పానాపుల్లో చోరీలు చేశాడు.

మరో సంఘటనల్లో సుబేదారి పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు హనుమ కొండ, దీన్ద్యలా కాలనీ చెందిన బూకరాజు సందీప్, వయస్సు 23, నిందితుడు గతంలో హనుమకొండ, పబ్లిక్ గార్డెన్స్ ప్రాంతాల్లో పార్కింగ్ చేసి వున్న ఆటోల్లో చిల్లర డబ్బులు దొంగలించి జల్సాలు చేసేవాడు. చిల్లర డబ్బులతో తన జల్సాలకు సరిపోకపోవడంతో నిందితుడు 2017 నుండి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాటు కరీంనగర్, ఖమ్మం ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు చోరీలకు పాల్పడటంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడు గత మే నెలలో ఖమ్మం జైలు నుండి విడుదలయి మరో మారు వరంగల్ మరియు హైదరాబాద్లో తాళం వేసిన వున్న 12 షట్టర్లలో చోరీలతో మూడు ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడ్డాడు. ఇందులో సుబేదారి. పోలీస్ స్టేషన్ పరిధిలో 7, రఘునాథ్ పల్లి 2. మట్వాడా, హనుమకొండ, ఘన్పూర్లో ఒకటి చొప్పున చోరీ

చేసాడు. అలాగే నిందితుడు హైదరాబాద్ ప్రాంతంలో మూడు ద్విచక్రవాహనాలు చోరీ చేసాడు. ఈ చోరీలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అందిన పక్కా సమాచారంతో నిందితులు ఇద్దరు చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను విక్రయించేందుకు వరంగల్,హనుమకొండ ప్రాంతాల్లో అనుమానస్పదంగా తిరుగుచుండగా పోలీసులు నిర్వహించిన వాహన తనీఖీలో పోలీసులకు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకోని విచారించగా వీరు పాల్పడిన నేరాలను పోలీసుల ఎదుట అంగీకరించడంతో పాటు వీరు ఇచ్చిన సమాచారంలో మిగతా ద్విచక్రవాహనలు, నగదునుతో పాటు ఇతర చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన డిసిపి క్రైమ్స్ మురళీధర్, క్రైమ్స్ ఎసిపి మల్లయ్య, సిసిఎస్ ఇన్సెస్పెక్టర్లు సూర్యప్రసాద్, శంకర్నాయక్, మట్వాడా, సుబేదారి ఇన్స్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, షూకూర్,, సుబేదారి, మట్వాడా,సిసిఎస్ ఎస్.ఐలు సాంబయ్య, నవీన్ కుమార్, సంపత్కుమార్, బాపురావు, ఏ.ఏ.ఓ సల్మాన్ పాషా, ఏ.ఎస్.ఐలు తిరుపతి, చంద్రమౌళి, హెడ్ కానిస్టేబుళ్ళు రవికుమార్, మహమ్మర్ఆలీ, వేణుగోపాల్, జంపయ్య, అశోక్, కానిస్టేబుళ్ళు వంశీ, విశ్వేశ్వర్, వినోద్, సదానందం, శ్రీకాంత్, తిరుపతి, హరికాంతలను పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ అభినందించారు.

Most Popular