తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా సేవలందించాయన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనకు బలం చేకూరుస్తూ వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కె. జ్యోతిర్మయి బుధవారం వేములవాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది.
హైదరాబాద్‌కు చెందిన జ్యోతిర్మయి తాజాగా హైదరాబాద్ నుంచి వేములవాడ కోర్టుకు బదిలీపై వచ్చారు. మంగళవారం వరకు విధుల్లో ఉన్న జ్యోతిర్మయికి ఉదయం ప్రసవ నొప్పులు రావడంతో ప్రసవం కోసం వేములవాడ ఏరియా ఆసుపత్రిని ఆశ్రయించారు. గైనకాలజిస్ట్ డాక్టర్ చైతన్య సుధా ఆమెకు సాధారణ ప్రసవం చేయగా, ఆడ శిశువుకు జన్మనిచ్చారు.ఆడ శిశువుకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
మరోవైపు దవాఖానలో మొదటి కాన్పులో భాగంగా ఆడ శిశువుకు జన్మనిచ్చిన తల్లికి ఉయ్యాలను బహుమతి ఇస్తున్నామని తెలిపారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేష్‌రావు. ఆడ శిశువుకు జన్మనిచ్చిన జడ్జికి కూడా ఊయల బహూకరించారు ఆసుపత్రి సూపరింటెండెంట్. దవాఖానలో అందుతున్న వైద్య సేవలపై న్యాయమూర్తి ఎంతో సంతృప్తి చెందారని ఆయన పేర్కొన్నారు.