Saturday, November 30, 2024

E-Paper

Homeలేటెస్ట్కాంగ్రెస్ టికెట్ కోసం ఎమ్మెల్యే రేఖానాయక్ దరఖాస్తు

కాంగ్రెస్ టికెట్ కోసం ఎమ్మెల్యే రేఖానాయక్ దరఖాస్తు

హైదరాబాద్: భారాసకు చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ టికెట్ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గాంధీభవన్ లో రేఖానాయక్ పీఏ దరఖాస్తు అందజేశారు.

సోమవారం భారాస అధినేత, సీఎం కేసీఆర్ ఆ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఖానాపూర్ టికెట్ ను భూక్యా జాన్సన్ కు భారాస కేటాయించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త, టీజీవో జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. త్వరలోనే రేఖా నాయక్ కూడా హస్తం పార్టీలో చేరే అవకాశముంది.

ఈ సందర్భంగా ఖానాపూర్ లో రేఖానాయక్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు తనతోనే ఉన్నారని చెప్పారు. తన జీవితం ప్రజలకే అంకితం చేయాలనే కోరికతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఎవరు మోసం చేసినా భగవంతుడు మోసం చేయడనే నమ్మకం తనకుందని చెప్పారు. ఖానాపూర్ నుంచి తాను పోటీలో ఉండటం ఖాయమనిఆమె స్పష్టం చేశారు.

Most Popular