Saturday, November 30, 2024

E-Paper

Homeలేటెస్ట్నకిలీ పురుగుల మందులు విక్రయిస్తున్న కేటుగాళ్ళ అరెస్టు..

నకిలీ పురుగుల మందులు విక్రయిస్తున్న కేటుగాళ్ళ అరెస్టు..

రైతన్నను దగా చేస్తూ నకిలీ, గడువు తీరిన
పురుగుల మందులు విక్రయిస్తున్న కేటుగాళ్ళ అరెస్టు

దేశానికి అన్నంపెట్టే రైతన్నను దగా చేస్తూ నకిలీతో పాటు గడువు తీరిన పురుగుమందులను విక్రయిస్తున్న
మూడు ముఠాలోని 11 మంది సభ్యులతో పాటు ప్రభుత్వ నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మరో ఇద్దరిని ఫోర్స్ పోలీసులు గీసుగొండ, నర్సంపేట, ఐనవోలు పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు.

వీరి నుండి పోలీసులు 57 లక్షల విలువైన నకిలీ మరియు గడువు తీరిన పురుగుల మందులు, నిషేధిత గడ్డి మందు, నకిలీ పురుగు మందులు తయారీకి అవసరమైన రసయానాలు, ప్రింటింగ్ సామగ్రి, ఖాళీలు బాటిల్స్, రవాణాకు వినియోగించే ఒక కారు, స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 24 లక్షల రూపాయల విలువైన గడువు తీరిన పురుగు మందులు, 30 లక్షల రూపాయల విలువగల నకిలీ పురుగు మందులు, 3లక్షల 53వేల రూపాయల విలువగల ప్రభుత్వ నిషేదిత గడ్డి మందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గడువు తీరిన పురుగు మందులు విక్రయిస్తు పోలీసులకు చిక్కినవారిలో

1.సునఫత్ వీరన్న,దస్ప తండా, గీసుగొండ మండలం, వరంగల్ జిల్లా, 2. ఇస్లావత్ వెంకటేష్, నందిగామ, నల్లబెల్లి మండలం, వరంగల్ జిల్లా, 3. ఏల సదాశివ రెడ్డి, శ్రీనగర్ కాలనీ, కరీంనగర్ జిల్లా, 1, ఈజిగిరి రాజు, రామచంద్రపూర్, ములుగుజిల్లా, 5, ఎడ్ల ఏలంధర్ రెడ్డి, నర్సింహులపేట, మహబూబాబాద్ జిల్లా,

నకిలీ పురుగు మందులు విక్రయిస్తు పోలీసులకు చిక్కినవారిలో

1. హనుమాండ్ల భాస్కర్, ఉప్పరపల్లి, చెన్నారావుపేట, వరంగల్ జిల్లా, 2. మాడితరి శేఖర్ రెడ్డి, ఉప్పల్,హైదరాబాద్,3. భూక్యా మాత్రు రాథోడ్, మహేశ్వరం, నర్సంపేట, వరంగల్ జిల్లా, 4. శెలగ నారాయణ,కొత్తపేట, హైదరాబాద్, 5.ఏదుల విష్ణు వర్ధన్ రెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, 6. వెలమ స్వపన్ కుమార్,లోకేశ్వర
మండలం, నిర్మల్ జిల్లాకు చెందిన వారు కాగా,

వరంగల్ జిల్లా, నందనం గ్రామం, ఐనవోలు మండలానికి
చెందిన బుర్ర ఎల్లగౌడ్, బోయినవల్లి శ్రీవతి రావు ఇరువురు నిషేదిత గడ్డిమందు విక్రయిస్తుపోలీసులకు చిక్కారు.

ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ గత నెల 24వ తేదిన పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, గీసుగొండ మరియు వ్యవసాయ అధికారులు సంయుక్తంగా కల్పి గీసుగొండ మండలం, మంగళ తండాలోని నిందితుడు ఇస్లావత్ వెంకటేశ్, సునవత్ వీరన్న నిర్వహిస్తున్న పురుగు మందుల విక్రయ షాపులో తనీఖీలు నిర్వహించగా అందులో గడువు తీరిన పురుగు మందులను అధికారులు గుర్తించడంతో, షాపు ఇద్దరు యజమానులను కేసు నమోదు చేసి విచారించగా వీరు ఇచ్చిన సమాచారం మేరకు కరీంనగర్ జిల్లాకు చెందిన యాలం సదాశివ రెడ్డి గత ఇరువై సంవత్సరాలుగా వివిధ పురుగల మందుల కంపెనీల్లో సెల్స్ ఆఫీసర్గా పనిచేసాడు. ఈ అనుభవంతో నిందితుడు సదాశివ రెడ్డి ప్రభుత్వ అనుమతులతో పురుగు మందులు విక్రయిస్తున్న డీలర్లు, దుకాణాల్లో గడువు తీరిన పురుగు మందులకు కంపెనీలకు తిరిగి పంపిస్తానని నమ్మబలికి తక్కువ ధరలకు పరుగు మందులను కొనుగోలు చేసి వాటిని తిరిగి కంపెనీలకు పంపకుండా, వాటిని తన నమ్మకస్తులైన మిగితా నిందితుల ద్వారా తెలంగాణలోని వరంగల్.. ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు నిందితుడు సదాశివ రెడ్డి గడువు తీరిన పురుగు మందులను ప్రస్తుతం అరెస్టు చేసిన మిగితా ఐదుగురు నిందితులకు సరఫరా చేసేవాడు. నిందితుడు సదాశివ రెడ్డి ఇంటి నుండి. పోలీసులు 24 లక్షల రూపాయల విలువగల గడువు తీరిన పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ పురుగు మందుల విక్రయాలు

నర్సంపేట ప్రాంతంలో నకిలీ పురుగు మందుల విక్రయాలు జరుగుతున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం రావడంతో పోలీసులు వ్యవసాయ అధికారుల కల్సి మహేశ్వం గ్రామంలోని తండాలో నివాసం వుంటున్న నిందితుడు భుక్యా మాత్రు రాథోడ్ ఇంటిపై పోలీసులు దాడులు జరపగా, ఈ దాడిలో అధికారులకు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ఎలాంటి ముందస్తు ప్రభుత్వ అనుమతులు లేకుండా తన ఇంటిని పురుగుల మందులు తయారీ కేంద్రంగా మార్చివేయడంతో నర్సంపేట, పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా నిందితుడు నకిలీ పురుగు మందుల తయారీ భాగంగా పెద్ద, పెద్ద డమ్ముల్లో రసాయాలు, పౌడర్లు మిశ్రమాల ద్రావణాన్ని కలిపి వాటిని లీటర్, ఆర లీటర్ డబ్బాల్లో నింపి వాటిపై వివిధ కంపెనీల పేర్లతో ఏవరికి అనుమానం రాకుండా ఆకర్షణీయమైన లేబుళ్ళను అతికించి రైతులకు విక్రయించేవాడని, ఈ నకిలీ పురుగు మందులు తయారీ అవసరమయిన ముడి సరుకును హైదరాబాద్లో కోనుగోలు చేస్తున్నట్లుగా నిందితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, ఈ సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ అధికారులు హైదరాబాద్లో ఎలాంటి అనుమతులు లేకుండా నకిలీ పురుగు మందులతో పాటు బయో ఉ తదకాలు తయారీ చేస్తున్న మల్టీకెమ్ ఆగ్రో ఇండస్ట్రీపై దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసారు వారి నుండి సూమారు 26లక్షల 50వ వేల రూపాయల విలువగల నకిలీ పురుగు మందులతో పాటు ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరో సంఘటనలో పోలీసులు చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న మరో నిందితుడు హనుమాండ్ల భాస్కర్ అరెస్టు చేసి విచారించగా నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్లోని కుంట్లూరు గ్రామం, అబ్దుల్లాపూరమెట్లో బయో ఉత్పాదాకాలు తయారీ ముసుగులో నకిలీ పురుగు మందుల విక్రయిస్తున్న శ్రీలక్ష్మీ బయోటెక్ కంపెనీపై వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి కంపెనీ యజమాని మాడితటి శేఖర్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకోని మూడు లక్షల 50వేల విలువైన నకిలీ పురుగు మందులతో తయారీకి వినియోగించే సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వరంగల్ జిల్లా ఐనవోలు మండలం, నందనం గ్రామంలో ప్రభుత్వం నిషేధించిన గలైఫోసటే అనే గడ్డి మందును విక్రయిస్తున్నట్లుగా పోలీసులకు అందిన సమాచారం మేరకు పోలీసులు, వ్యవసాయ అధికారులు నందన గ్రామంలోని శ్రీ సోమేశ్వర ఎరువులు మరియు పురుగు మందుల విక్రయ దుకాణంపై దాడులు నిర్వహించి సుమారు మూడులక్షల 53వేల రూపాయల విలువైన నిషేధిత గలైఫోసటే గడ్డి మందును స్వాధీనం చేసుకోవడంతో పాటు షాపు నిర్వహకులైన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగింది.

రైతులను మోసం చేస్తు నకిలీ, గడువు తీరిన పురుగు మందుల విక్రయాలకు పాల్పడుతున్న కేటుగాళ్ళను. పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ ఏసిపిలు మధుసూదన్, జితేందర్ రెడ్డి, ఇన్సెస్పెక్టర్లు శ్రీనివాస్ రావు, అల్లం రాంబాబు, బాబూలాల్,పవన్ కుమార్, పెండ్యాల దేవేందర్, ఎస్.ఐలు నరసింహరావు, వంశీకృష్ణ, శరత్ కుమార్, లవన్ కుమార్, నిస్సార్పాషా, ఏఏఓ సల్మాన్పషా, టాస్క్ఫోర్స్ హెడాకానిస్టేబుళ్ళు అశోక్, స్వర్ణలత, కానిస్టేబుళ్ళు, శ్రీనివాస్, ప్రభాకర్, దయాసాగర్, అబ్దుల్లా, రాజేష్, కిరణ్, భిక్షపతి, రాజు, శ్యాంసుందర్, సురేష్, మహబూబాషా, కరుణాకర్, శ్రీధర్, సతీష్, రమేష్, నరేష్, నవీన్ కుమార్, శ్రీనివాస్, గౌతం, శ్రావణ్ కుమార్, నాగరాజులను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ మీడియా సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, నర్సంపేట ఏసీపీ తిరుమల్ పాల్గొన్నారు.

పురుగుల మందులు కొనుగోలు చేసేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. రైతులు పురుగుల మందులు కొనేటప్పుడు డీలర్ లైసెన్సు లో కంపెనీ పేరు ఉందా/లేదా అని చూసుకోవాలి.
2. ప్రొడక్ట్ పై ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్సు నెంబర్, డీలర్ లైసెన్సులో ఉందా/లేదా అని చూసుకోవాలి.
3. రైతులకు ఏదైనా అనుమానం వచ్చినట్లయితే కంపెనీ యొక్క principle సర్టిఫికేట్ అడిగి అందులో ప్రాడక్ట్ పేరు ఉందా/లేదా అని చూసుకోవాలి.
4. పురుగుల మందు కొనేటప్పుడు విధిగా రశీదు తీసుకొని, దానిలో బ్యాచ్ నెంబర్, తయారు తేదీ మరియు గడువు తేదీ నమోదు చేశారా లేదా చూసుకోవాలి.
5. ప్రొడక్ట్ పై ఉన్న గడువు తేదీని పరిశీలించిన తరువాతనే కొనుగోలు చేయాలి.
6. ప్రొడక్ట్ పై ఏదైనా అనుమానం కలిగినట్లైతే, డీలర్ వద్ద గల ఇన్వాయిస్ (Invoice)లో ఎక్కడ నుండి, ఎంత కొనుగోలు చేశారు, బ్యాచ్ నెంబర్, తయారు తేదీ మరియు గడువు తేదీ చూసుకోవాలి.
జీవ ఉత్పాదకాలు (BIO STIMULANTES) కొనుగోలు చేసేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
1. జీవ ఉత్పాదకాలు తయారు చేసే కంపెనీ వారు ఖచ్చితంగా NABL (National Accreditation Board for Testing and Calibration Laboratories) గుర్తింపు ఉన్న ల్యాబ్ లో వారి ఉత్పాదకాలు తనికి చేపించుకొని వారి నుండి Certificate పొందిన తరువాత Commissioner for Agriculture, Telangana వారి నుండి G2 పొందిన తరువాతనే వారి ఉత్పత్తిని ప్రారంబించాలి.
2. జీవ ఉత్పాదకాలు తయారు చేసే కంపెనీ వారు, వారు certificate పొందిన Address లో మాత్రమే తయారుచేయాలి.
3. రైతులు జీవ ఉత్పాదకాలు కొనేముందు, డీలర్ వద్ద ఆ కంపెనీ యొక్క కోర్టు ఆర్డర్ గాని, G2 certificate గాని పరిశీలించిన తరువాతనే కొనుగోలు చేయాలి.
4. జీవ ఉత్పాదకాలు కొనేటప్పుడు విధిగా రశీదు తీసుకొని, దానిలో బ్యాచ్ నెంబర్, తయారు తేదీ మరియు గడువు తేదీ నమోదు చేశారా లేదా చూసుకోవాలి.

GLYPHOSATE అనే గడ్డి మందు వాడకం గురుంచి రైతులకు తగు సూచనలు:
o GLYPHOSATE అనే గడ్డి మందును పొలం గట్ల మీద మరియు తేయాకు తోట్లలో మాత్రమే వాడాలి, పంట పొలాలపై ఎక్కువగా వాడడం వలన భూమిలో ఎటువంటి మొక్కల పెరుగుదల ఉండదు.
o GLYPHOSATE అనే గడ్డి మందు non-selective herbicide జాతికి చెందినది, దీనిని పంట పొలాలలో అధికంగా వాడడం వలన భూములు నిస్సారంగా మారుతాయి.
o GLYPHOSATE అనే గడ్డి మందు అమ్మకాన్ని ప్రభుత్వం నిషేదించినప్పటికి, కొంతమంది వ్యక్తులు, కోర్టును ఆశ్రయించి, కోర్టుకు వారు ఇట్టి గడ్డి మందును పంట పొలాలకు అమ్మకం చేయము అని చెప్పి, కోర్టు ఆర్డర్ పొంది దాని మాటున పంట పొలాల రైతులకు అమ్ముతున్నారు.
o భవిష్యత్ తరాలకు సారవంతమైన భూములు ఇవ్వవలిసిన బాద్యత మనపై ఉంది కావున రైతులు GLYPHOSATE అనే గడ్డి మందు వాడకుండా ఉండడం మన అందరి బాధ్యత.

Most Popular