Friday, November 8, 2024

E-Paper

Homeలేటెస్ట్మొన్నటి వరకు కాసులు.. ఇప్పుడు కన్నీళ్లు... భారీగా పడిపోయిన టమాటా ధరలు..

మొన్నటి వరకు కాసులు.. ఇప్పుడు కన్నీళ్లు… భారీగా పడిపోయిన టమాటా ధరలు..

ఇన్ని రోజులు కాసుల వర్షం కురిపించిన టమాటా.. ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. ఎంతగా అంటే.. ఛాయ్ కంటే తక్కువకే మొదటి రకం టమాటాలు కిలో వచ్చేంత. అదేంటీ ఇన్ని రోజులు చుక్కలు చూపించిన టమాటా అంత ఘోరంగా ఎలా పడిపోతుంది అనుకుంటున్నారా.. నిజమండీ బాబు.. నమ్మకపోతే ఈ స్టోరీ చదివేసేయండి.

భారీగా పడిపోయిన టమాటా ధరలు కిలో టమాటాలు కేవలం తొమ్మిది రూపాయలే లబోదిబోమంటున్న టమాటా రైతులు.

ఇన్ని రోజులు కొండెక్కి కూర్చొన్న టమాటా.. ఇప్పుడు అమాంతం లోయలో పడిపోయింది. సామాన్యులు కొనలేని స్థాయిలో ధరలతో మంటెక్కించిన టమాటా.. ఇప్పుడు ఛాయ్ కంటే చీప్‌గా మారిపోయింది. రైతులను కోటీశ్వరులను చేసిన అదే టమాటా.. ఇప్పుడు దీవాలా తీపించే స్థాయికి దిగజారిపోయింది. ఒకానొక దశలో కిలో రూ.300 దాకా చేరిన వార్తల్లోకెక్కిన టమాటా.. ఇప్పుడు ఊహించని స్థాయిలో పడిపోయి మళ్లీ చర్చనీయాంశంగా మారిపోయాయి. గడిచిన నెల రోజులుగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌తో పాటు, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఒక్కసారిగా కొత్త పంట మార్కెట్‌లోకి రావడంతో సరఫరా అమాంతం పెరిగింది. దీంతో.. ధరలు కూడా ఒక్కసారిగా పడిపోయాయి…!!

Most Popular