తిరుమల: తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు.
బోనులో చిక్కిన మగ చిరుతకు దాదాపు ఐదేళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. మరోవైపు, అలిపిరి నడక మార్గంలో భక్తులకు కర్రల పంపిణీపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌ను వారు ఖండించారు. అటవీశాఖ అధికారుల సూచన మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని భూమన తెలిపారు. ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ..
”ఎస్వీ జూ పార్కు నుంచి చిరుతలు తెచ్చి వదులుతున్నామంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నాం. చిరుత సంచారంపై నిఘా కోసం కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎలుగుబంట్ల సంచారంపై డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెట్టాం” అని చెప్పారు..