ఆయుధం హన్మకొండ
హన్మకొండ జిల్లా హాసన్ పర్తి మండలంలోని వంగపాడు గ్రామానికి చెందిన మావో యిస్టు నేత మందా రూబెన్ అలియాస్ మంగన్న గత 40 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండగా.ఆకుటుంబాన్ని శుక్రవారం వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా పరామర్శించారు. ఈ సందర్బంగా రూబెన్ తల్లి చంద్రమ్మతో పాటు కుటుంబసభ్యుల ప్రస్తుతస్థితిగతులతో పాటు చంద్రమ్మ ఆరోగ్య పరిస్థితిపై డీసీపీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోమయ్య తల్లి చంద్రమ్మకు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పంపించిన చీరతో పాటు కుటుంబ సభ్యులకు దుప్పట్లు,నిత్యావసర సరకులను పోలీసుఅధికారులు అందజేశారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి మావోయిస్టు పార్టీలో పని చేసి సాధించింది శూన్యమని. ఇకనైనా రూబెన్ అజ్ఞాతం వీడి జనంలోకి రావాలని, ప్రస్తుత రోజుల్లో మావోయిస్టులకు ప్రజాదరణ తగ్గిందని.ఇవే కాకుండా అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు ఆరోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నారని. ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యారని అన్నారు. మందా రూబెన్ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే, ఆయనపై ఉన్న రివార్డ్ పాటుప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజ నాలు అందేలా కృషిచేస్తామని డీసీపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ తిరుమల్, స్పెషల్ బ్రాంచ్ 2 ఏసీపీ పార్థసారథి, హాసన్ పర్తి ఇన్స్ స్పెక్టర్ చేరాలు తదితర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.