Saturday, November 30, 2024

E-Paper

Homeజాతీయంరూ.10 నాణాలు చలామణిలోనే ఎస్ బి ఐ జీఎం ప్రకాష్ చంద్ర భరోరు

రూ.10 నాణాలు చలామణిలోనే ఎస్ బి ఐ జీఎం ప్రకాష్ చంద్ర భరోరు

వరంగల్, ఆయుధం: పది రూపాయల నాణాలు చలామణిలో ఉన్నాయని, ఈ విషయంలో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మరాదని భారతీయ స్టేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్(నెట్వర్క్ 2) ప్రకాష్ చంద్ర బరోర్ అన్నారు. శనివారం వరంగల్ జేపీఎన్ రోడ్ లోని భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రధాన శాఖలో పది రూపాయల నాణాల చలామణిపై బ్యాంక్ డీజీఎం గన్ షామ్ సోలంకి అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమంలో జిఎం ప్రకాష్ చంద్ర బరోర్ మాట్లాడారు. రిజర్వ్ బ్యాంక్ తయారుచేసిన పది రూపాయల నాణేలు చలామణిలో ఉన్నప్పటికీ ప్రజల్లో తప్పుడు ప్రచారంతో కొందరు అయోమయం సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ కరెన్సీ కి చెందిన అన్ని రూపాయలు, నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని.. అయినప్పటికీ ₹10 నాణెం చెల్లుబాటు కావడం లేదంటూ దేశంలో విస్తృత దుష్ప్రచారం జరగడం బాధాకరం అన్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ స్థాయి చిన్న వ్యాపారులు 10 రూపాయల నాణెం చలామణి అవడం లేదని దుష్ప్రచారాన్ని నమ్ముతుండడంతో పరిస్థితి ఇలా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పది రూపాయల నాణెం చెల్లుబాటులేవని దుష్ప్రచారం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్‌బీఐ భారతీయ రిజర్వ్ బ్యాంకు తో కలిసి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.. పది రూపాయల నాణాలు తమ రోజువారి వ్యాపారం కార్యకలాపాల్లో ప్రజలు సజావుగా వినియోగించుకోవచ్చని అన్నారు. చిన్న వ్యాపారాలు, పేద, దిగువ మధ్యతరగతి వర్గాల రోజువారి కార్యక్రమాల్లో పది రూపాయలు కీలకమైందని అన్నారు. పది రూపాయలు నాణెం చలామణిలో ఉందనే విషయాన్ని గ్రామీణ స్థాయి నుంచి నగర స్థాయి వరకు చిన్న మధ్యతరగతి వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు గుర్తించుకొని చలామని చేసుకోవాలని ఎస్‌బీఐ జీఎం ప్రకాష్ చంద్ర భారోర్ ప్రజలను కోరారు. ప్రజలకు అవసరమైన పది రూపాయల నాణేలు సమీప భారతీయ స్టేట్ బ్యాంకు శాఖల్లో పొందువచ్చని, అలాగే తమవద్ద ఉన్న పది రూపాయల నాణేలు డిపాజిట్ కూడా చేయవచ్చని జీఎం ప్రకాష్ చంద్ర బరూర్ సూచించారు. ఈ కార్యక్రమంలో భారతీయ స్టేట్ బ్యాంక్ జీఎం(నెట్వర్క్ 1) రవికుమార్ వర్మ, వరంగల్ ప్రధాని శాఖ మేనేజర్ డీఎస్.నరేంద్ర కుమార్, ఏజీఎంఎస్ జి.శంకర్, అబ్దుల్ రెహమాన్, వరంగల్ సర్కిల్ అభివృద్ధి అధికారి జితేంద్ర కుమార్ శర్మ, బ్యాంక్ అధికారులు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు.

Most Popular