Saturday, November 9, 2024

E-Paper

Homeజాతీయంహెల్త్ డ్రింక్స్’ కేటగిరీ నుంచి బోర్న్‌విటా తీసేయండి : కేంద్రం ప్రభుత్వం...

హెల్త్ డ్రింక్స్’ కేటగిరీ నుంచి బోర్న్‌విటా తీసేయండి : కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు

కేంద్రం ప్రభుత్వం ఇ-కామర్స్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై బోర్న్‌విటాతోపాటు అన్ని రకాల పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’ కేటగిరీ నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. బోర్న్‌విటాలో పరిమితికి మించి షుగర్ లెవల్స్ ఉన్నట్లు NCPCR పరిశోధనలో తేలింది. ఆహార భద్రతా ప్రమాణాలను పాటించకుండా పవర్ సప్లిమెంట్లను హెల్త్ డ్రింక్స్‌గా ప్రచారం చేసుకుంటున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని FSSAIని కోరింది. బోర్న్ విటాలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని విమర్శలు వెల్లువెత్తడంతో ఎన్‌సీపీసీఆర్ రంగంలోకి దిగింది. సీఆర్‌పీసీ చట్టం 2005లోని సెక్షన్ 14 కింద విచారణ జరిపింది. ఎఫ్ఎస్ఎస్ చట్టం, 2006, మోడల్జ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన నియమాలు, నిబంధనల్లో హెల్త్ కేటగిరీ డ్రింక్స్ సరిగా నిర్వచించలేదని మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 10 నాటి నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ మోడల్జ్ కంపెనీ బోర్న్ విటా, క్యాడ్ బెర్రీ వంటి అనేక ఇతర పెద్ద బ్రాండ్‌లను కూడా కలిగి ఉంది. ప్రత్యేకించి బోర్న్‌విటాలో షుగర్ లెవల్స్ అధిక స్థాయిలో ఉన్నాయని తేలడంతో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంది.

Most Popular