Saturday, November 30, 2024

E-Paper

Homeజాతీయంఅవినీతిపరులు ఒక్కరు కూడా తప్పించుకొలేరు: ప్రధాని మోడి

అవినీతిపరులు ఒక్కరు కూడా తప్పించుకొలేరు: ప్రధాని మోడి

అవినీతిపరులు ఒక్కరు కూడా తప్పించుకోలేరని దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగ సభలో శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు అన్నదమ్ముల తనంతో ఉంటాయని కుంభకోణాలు చేసే పార్టీలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 2 జి కుంభకోణంలో అవినీతికి పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ నీటికి సంబంధించిన వాటిలో అవినీతికి పాల్పడ్డారిని అన్నారు. నాగర్ కర్నూల్, నల్గొండ, సికింద్రాబాద్, మహబూబ్ నగర్ ఈ నాలుగు పార్లమెంట్ నియోజకవర్గం లలోబిజెపి అభ్యర్థులైన కిషన్ రెడ్డి, డికే అరుణ, భరత్ కుమార్, సైదారెడ్డి, అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునిక టెక్నాలజీతో సహయంతో నమో తెలుగు యాప్ ద్వారా అన్ని వివరాలు పొందుపరచి ఉంటాయని మీరు నాతో కనెక్ట్ కావడానికి ఈ యాప్ ఉపయోగించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో అధిక సంఖ్యలో బిజెపి అభ్యర్థులను గెలించాలని కొరారు.మరికొద్ది సేపట్లో దేశంలో ఢిల్లీ నుంచి ఎన్నికల షెడ్యూల్ వస్తుందని మోడీ పేర్కొన్నారు దేశంలో మరోసారి బిజెపి ప్రభుత్వం వస్తుందని తెలంగాణలో కూడా ఇదే ఫలితం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

 

Most Popular