Friday, November 8, 2024

E-Paper

Homeజాతీయంఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బరిలో మాజీ సీఎంల తనయులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బరిలో మాజీ సీఎంల తనయులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్నికలు రక్తి కట్టిస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే పార్టీలు దాదాపుగా అభ్యర్థుల ఖరారు పూర్తి చేసి ఎన్నికల కదనరంగంలోకి దిగి ప్రచారం జోరుగా చేస్తున్నారు. కాగా, ఏపీ అసెంబ్ల ఎన్నికలకు సంబంధించి ఆరుగురు అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రుల తనయులు పోటీలో నిలవడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి కుమారులు ఈ సారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కడప జిల్లా పులి వెందుల నుంచి వైఎస్‌ఆర్‌ తనయుడు, ప్రస్తుత సీఎం జగన్ అధికార పార్టీ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కుమారుడు సూర్య ప్రకాశ్ టీడీపీ అభ్యర్థిగా డోన్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక ఎన్‌టీ.రామారావు తనయుడు బాలకృష్ణ టీడీపీ అభ్యర్థిగా హిందూపురం నుంచి, చంద్రబాబు వారసుడు లోకేశ్ టీడీపీ అభ్యర్థిగా మంగళగిరి నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇక నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు మనోహర్ జనసేన పార్టీ తరపున తెనాలి నుంచి, నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి కుమారుడు రాంకుమార్ వైసీపీ అభ్యర్థిగా వెంకటగిరి నుంచి పోటీలో ఉన్నారు.

Most Popular