ఇంటి ఆవరణలో గుమ్మముందు పులి ఉంది అవును నిజమే మీరు చూస్తున్నది నిజమే కాకుంటే ప్రాణం ఉన్న పులికాదు నిజంగా పులి మాదిరి పులి బొమ్మ ఎందుకుపెట్టారు. చిన్నపిల్లలు ఆడుకొవాడానికికాదు పిల్లలు బయపడటానికి కాదు.మరిఈ పులి బొమ్మ ఎక్కడ ఎందుకు పెట్టారు అని తెలుసుకొవాడానికి ఈ స్టొరీ చదువాల్సిందే, దేశంలో రొజురొజుకు కోతుల బెడద పెరిగిపోతుంది. అడవిలో ఉండాల్సీన కొతులు అడవులను విడిచి గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేసి రైతులను తీవ్ర నష్టాలకు గురిచేయడమే కాకుండా ఇప్పుడు గ్రామాలను ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. ఒంటరి మహిళలు, పిల్లలపై దాడులు చేస్తున్నాయి. వాటి బాధకొసం యాదాద్రి భువనగిరి జిల్లాలొని పోచారం గ్రామంలో జింకల నాగలక్ష్మి అనే మహిళ తమ ఇంటికి కొతులు రాకుండా ఉండాలని రెండువేలతో హైదారాబాద్ లో ఒక పులి బొమ్మను కొనుగొలు చేసి ఆ బొమ్మను తమ ఇంటిమేందు గుమ్మంలో పెట్టింది నిన్నటిదాక వచ్చిన కొతులు ఆ పులి బొమ్మను చూసి భయపడి ఆఇంటి ముందటికి రాకుండా కొతులు పారిపోతున్నాయి.