తిరుమల కొండపైగోవిందవిందా నామాలే వినిపించాలని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు అధికారులకు అదేశాలు జారీచేశారు. పద్మావతి అతిథి గృహంలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.తిరుమల వెంకటేశ్వరస్వామి సన్నధిలో పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలి,అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్పష్టం చేశారు.భక్తుల మనోభావాలకు సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడొద్దని అన్నారు. తిరుమల తిరుపతిలో ప్రశాతంతకు భంగం కలగకూడదని తెలిపారు. తిరుమల వెంకటేశ్వరస్వామికి పూర్వ వైభవం తీసుకొస్తామని నాడు ఎన్టీఆర్ హయాంలో తిరుమలలో అన్నదానం ప్రారంభమైందని గుర్తు చేశారుతిరుమలలో అందిస్తోన్న సేవలపై భక్తుల నుంచి స్పందన గురించి అధికారులను సీఎం చంద్రబాబు అడిగారు. తిరుమల వచ్చిన ప్రతి భక్తుడి అనుభవాల గురించి అభిప్రాయం చెప్పే అవకాశం కల్పించాలని సూచించారు. భక్తుల సలహాలు, సూచనలతో మరింత మెరుగ్గా సేవలు అందించొచ్చని పేర్కొన్నారు. ఒక్క తిరుమలలోనే కాక మిగతా ఆలయాల్లో కూడా భక్తుల అభిప్రాయం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సూచించారు.