ఆయుధం హన్మకొండ
దేశంలోని గిరిజనుల కోసం జాతీయ స్థాయిలో ఎస్టీ కమిషన్ పనిచేస్తుంది జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు.శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి లతో కలిసి వైద్య, ఆరోగ్య, గిరిజన హాస్టల్స్ తదితర అంశాలపై డీఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఇతర వైద్యాధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ క్యాన్సర్ పేషంట్ల కోసం కేంద్ర ప్రభుత్వం పథకాన్ని తీసుకువచ్చిందని, ఈ పథకం ద్వారా క్యాన్సర్ వైద్యానికి పదిహేను లక్షల రూపాయలను అందజేస్తుందని అన్నారు.ఈ పథకం గురించి ప్రచారం కల్పిస్తే అవసరార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల జిల్లా అధికారులు, వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎంజీఎం ఆసుపత్రి లో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని, వైద్యం కోసం వచ్చే వారికి భరోసా కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. గిరిజన హాస్టళ్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలన్నారు. విద్యార్థుల కోసం అవసరమైతే సీట్లు, రూమ్ ల సంఖ్యను పెంచేవిధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అదేవిధంగా గిరిజన బంజారా భవన్లో సౌకర్యాలను మెరుగుపరిచేవిధంగా ప్రణాళికను తయారు చేసి పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో విద్య, వైద్య, గిరిజన హాస్టల్స్, ఆసుపత్రులు, తదితర అంశాల గురించి ఆయా అధికారులను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా హనుమకొండ ఆర్డిఓ వెంకటేష్, కెఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్, ప్రభుత్వ ఛాతి ఆసుపత్రి ఇంచార్జి డాక్టర్ రవి, పరకాల ఆసుపత్రి డాక్టర్ గౌతమ్ చౌహన్, డీటీడీవో ప్రేమకళ, ఆర్సీవో డీఎస్ వెంకన్న, ఆర్ అండ్ బీ డీఈ రాజు, హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి,ఇతర అధికారులు పాల్గొన్నారు.