దేశంలో రాహుల్ గాంధీ చెల్లని సీటు ఆయన సొంత సీటు గెలవలేని పరిస్థితిలో ఉన్నాడని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నాడు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నాడు ఆమేథిలో ఓడిపోయాడని అక్కడి నుంచి పారిపోయి వాయినాడులో గెలిచాడని నేడు అక్కడ కూడా ఓడిపోయే పరిస్థితి ఉందని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో 40 సీట్ల కన్నా మించిరావని ఇది నేను అంటున్న మాట కాదని వారి మిత్రపక్షం అంటున్నారని వారి మిత్రపక్షం మమత బెనర్జీ అన్నదని అన్నారు. రేవంత్ రెడ్డి ఎవరి కోసం పని చేస్తున్నారో మీరే చూడండి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కోసం పని చేస్తున్నారా మోడీ కోసం పని చేస్తున్నాడా అని అన్నారు. రాష్ట్రంలో 218 మంది ఇప్పటివరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ రెడ్డి అనాడు చనిపోయిన రైతులకు 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశాడని మరి నేడు రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వారి లిస్టు ముఖ్యమంత్రి కి పంపిస్తాం ఆయన 218 మంది రైతులకు ఒక్కరికి 25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.