Friday, November 8, 2024

E-Paper

Homeజాతీయంఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటిముందు ధర్నా చేస్తా మాజీ మంత్రి హరీష్ రావు

ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటిముందు ధర్నా చేస్తా మాజీ మంత్రి హరీష్ రావు

వరంగల్ లో కాంగ్రెస్ పార్టీచేసిన డిక్లరేషన్ అమలు కోసం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీఇంటిముందు ధర్నా చేయనున్నట్లు సిద్దిపేట ఎమ్మెల్యే మాజీమంత్రి,హరీష్‌రావు అన్నారు దసరా పండుగ తదుపరి ఢిల్లీకి వెళ్తామని చెప్పారు.ఉమ్మాడి వరంగల్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాలో హరీష్‌రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూరైతుల రుణమాఫీ చేసేవరకూ వదిలిపెట్టమని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీ స్పందించాలని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒకచేతిలో రాజ్యాంగం మరో చేతితో రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ది రైతు గుండె రేవంత్‌ది రాతిగుండె అని హరీష్‌రావు విమర్శించారు.సీఎం రేవంత్ రెడ్డి అబద్దాల పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఆగష్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని అన్ని దేవుళ్లపై ఒట్టుపెట్టి మోసగాడిగా మారారని హరీష్‌రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు మోసగాడు అని విమర్శించారు. 31 కుంటి సాకులు చెప్పి రేవంత్ రుణమాఫీ ఎగ్గొడుతున్నారని అన్నారు.హైడ్రాపేరుతో పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోమని హరీష్‌రావు హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దసరాలోపు రైతుబంధు డబ్బులు ఇవ్వాలని హరీష్‌రావు కోరారు.ప్రజలకు హామీలు అమలు చేసే వరకూ రేవంత్‌ను వదిలిపెట్టమని హెచ్చరించారు. రైతులు చనిపోయినా రేవంత్‌కు కనికరం లేదా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి నిరసన వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులను రైతులు నిలదీయాలని అన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలిపారు .రేవంత్ రెడ్డి గుండాగిరిచేస్తే బీఆర్ఎస్ నేతలు చూస్తూ ఊరుకోరని హరీష్‌రావు వార్నింగ్ ఇచ్చారు.

Most Popular