Friday, November 8, 2024

E-Paper

Homeతెలంగాణతెలంగాణ ఓటాన్ అకౌంట్ .2,75,891 కోట్లతో బడ్జెట్‌

తెలంగాణ ఓటాన్ అకౌంట్ .2,75,891 కోట్లతో బడ్జెట్‌

ఆయుధం హైదారాబాద్
తెలంగాణ రాష్ట్రంలో 2024-25 ఎడాదిగాను తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో రాష్ట్ర ఉప ముఖ్యంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. .2,75,891 రూపాయాల కోట్లతో బడ్జెట్ సారాంశాన్ని ఉప ముఖ్యంత్రి భట్టి విక్రమార్క చదివి వినిపించారు. రెవెన్యూ వ్యయం .2,01,178 రూపాయాల కోట్లు, మూలధన వ్యయం .29,669 రూపాయాల కోట్లుగా ఉన్నట్టు ఉపముఖ్యమంత్రి తెలిపారు.2024-25 సంవత్సరానికిగాను తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,75,891 కోట్లతో కూడిన బడ్జెట్ పాఠాన్ని ఉప ముఖ్యంత్రి భట్టి విక్రమార్క చదివి వినిపించారు. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు , గృహ నిర్మాణ రంగానికి రూ.7,740 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లువ్యవసాయానికి రూ.19,746 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.40,080 కోట్లు,నీటిపారుదల శాఖకు రూ.28,024 కోట్లు మూసీ ప్రాజెక్టుకు రూ.1,000 కోట్లు,పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు, విద్యా రంగానికి రూ.21,389 కోట్లు,ఎస్టీకి సంక్షేమ శాఖకు రూ.13,313 కోట్లు,వైద్య రంగానికి రూ.11,500 కోట్లు,ఎస్సీ సంక్షేమ శాఖకు రూ.21,874 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖకు రూ.2,262 కోట్లు బీసీ సంక్షేమ శాఖకు రూ.8,000 కోట్లు కెటాయించారు రాష్టంలో నూతనంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని. అందుకోసం బడ్జెట్‌లో ఐదువందల రూపాయాల కోట్లు కేటాయిస్తున్నమని చెప్పారు. విధ్య రంగానికి బడ్జెట్‌లో 21,389 రూపాయాల కొట్లు కేటాయించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు స్కాలర్ షిప్‌లను సకాలంలో అందజేస్తాంమని ఐటీఐ కాలేజీలకు పూర్వవైభవం తీసుకొచ్చి వందశాతం ఉద్యోగాలు వచ్చేలా ప్రణాళికలు చేస్తామని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో సర్కార్ ఉంది. అందుకోసం గుజరాత్, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాల్లో అధ్యయనానికి అధికారుల బృందం వెళ్లనుంది. ఓయూతోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు కేటాయిస్తున్నాం. అని తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను నిర్వహించే టీఎస్‌పీఎస్సీకి .40 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్టు మంత్రి తెలిపారు

Most Popular