Friday, November 8, 2024

E-Paper

Homeతెలంగాణఅసెంబ్లీ సమావేశాలు పద్దతి గా జరగటం లేదు...? ఎమ్మెల్యే సీతక్క

అసెంబ్లీ సమావేశాలు పద్దతి గా జరగటం లేదు…? ఎమ్మెల్యే సీతక్క

గత నాలుగు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు సమయం పద్ధతి ప్రకారం లేదని , క్వషన్ అవర్ ఉంటదో , జీవో అవర్ ఉంటాదో లోదో తెలియడం లేదని . అప్పటికప్పుడు తెలుసుకొని సబ్జెక్ట్ మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రతిపక్షాలకు మాట్లాడిచ్చే అవకాశమే ఉంటలేదు మొదటి రోజు సంతాపదినాలకే పూర్తయింది, రెండవ రోజు క్వశ్చన్ అవర్, మూడవరోజు జీరో అవర్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకుండా బి ఆర్ ఎస్ వాళ్లే సమయం మొత్తం మాట్లాడుతున్నారు. జీరో అవర్ లో మాలాంటి వెనుకబడిన ప్రాంతాల వారికి రాష్ట్రంలో ఉన్న రకరకాల ఉద్యోగస్తులు బాధల గురించి అసెంబ్లీలో మాట్లాడదామని ప్రిపేర్ అవుతే పోలీస్ సోదరులు మాకు పిఆర్సి వద్దు ఓల్డ్ పెన్షన్ కావాలనేదానిమీద అదేవిధంగా టిఏ,డిఏలు వాళ్ళకి సంబంధించినవి రాసిచ్చినారు, అదేవిధంగా సత్తుపల్లిలో ట్రైబల్ బెటాలియన్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు స్థాపించారు. ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకి ఎటువంటి ట్రాన్స్ఫర్లు,ప్రమోషన్లు లేవు స్పెషల్ కేటగిరి లోనే ఉన్నారు, అలాగే వరద బాధితుల గురించి మాట్లాడాలని,మల్లంపల్లి మండలం గురించి, అంగన్వాడీ టీచర్లు, గ్రామ మహిళా సంఘాలు, సీఐల్ గా పని చేసే వాళ్ల గురించి, సి ఆర్ టి లు, ఆరోగ్య శ్రీ లో పని చేసే వాళ్ళు, గోపాలమిత్ర,ఆరోగ్య మిత్ర రకరకాల పని చేసే వాళ్ళ సమస్యలపై మాట్లాడదామంటే ఎటువంటి సమస్యలు లేవు అన్నట్టుగా సంబరాలు జరుపుకుంటున్నారు. స్పీకర్ మాట్లాడించే అవకాశం లేకుండా ఉన్నది అసెంబ్లీ సమావేశాలలో అనేక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళ సమస్యలగురించి ఎక్కడ ఎవరితో ప్రస్తావించాలి. అబద్దాలను ప్రచారం చేసుకోవడానికి అసెంబ్లీని వేదికగా ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా మంచినీళ్ల గురించి తీస్తే తప్పు పడుతున్నారు. ప్రజలు చాలామంది ప్రైవేటు క్యాన్లు తెప్పించుకుని తాగుతున్నా పరిస్థితి మీరు ఇచ్చిన నీళ్లు ఎంతమంది తాగుతున్నారు, దాతల సహకారంతో ఇంకా ముందుకు నడుస్తున్నారు ప్రజలు. అసెంబ్లీలో లేని రేవంత్ రెడ్డి గురించి, అలాగే కాంగ్రెస్ నాయకుల గురించి మాట్లాడుతున్నారు మేము ఏదైనా మాట్లాడితే పక్కదారి పట్టిస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలను ఎన్నికల గురించి పెట్టుకున్నారు తప్ప ప్రజల సమస్యల గురించి, వివిధ వర్గాల సమస్యల గురించి మాట్లాడి చర్చిస్తారేమో, భరోసానిస్తరేమో అనుకున్నాం అని ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు

Most Popular