Thursday, April 3, 2025

E-Paper

Homeక్రీడా వార్తలుక్రీడా విజేతలను సత్కరించి ఎమ్మెల్యే

క్రీడా విజేతలను సత్కరించి ఎమ్మెల్యే

హన్మకొండ సిటీ (ఆయుధం)
హైదరాబాద్ లో ఇటీవల గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్ స్టేట్ మీట్ పోటీల్లో విజయం సాధించిన విజేతలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం శాలువాలు కప్పి సత్కరించారు. అభినందించారు. హనుమకొండ జిల్లా నుంచి 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్న క్రీడాకారులు బంగారు పతకాలు సాధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ట్రిపుల్ జంప్‌లో ముక్తవరపు సరస్వతి కాంస్య పథకం, ట్రిపుల్ జంప్‌లో సాయిచరణ్ గోల్డెమెడల్ సాధించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇలాగే మరిన్ని విజయాలు సాధించి హనుమకొండ జిల్లాకి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొని రావాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడాకారులకు తన వంతు సహాయం, ప్రోత్సహం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Most Popular