Saturday, November 30, 2024

E-Paper

Homeతెలంగాణపని పని అని పతార పెంచుకోలేకపోయాం - మాజీ మంత్రి హరీష్ రావు

పని పని అని పతార పెంచుకోలేకపోయాం – మాజీ మంత్రి హరీష్ రావు

రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను తప్పనిసరిగా గెలిపించాలని మాజీ మంత్రి హరీష్ రావు కార్యకర్తలకు సూచించారు. షాద్ నగర్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ కోసం గల్లీలో ఢిల్లీలో కొట్లాడేది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలైన ఆరు గ్యారెంటీలను అమలు చేయించేందుకు బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని.. అప్పుడే మెడలు వంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటామని అన్నారు. అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగాయని అన్నారు. పని పని అని.. పతారా పెంచుకోలేకపోయామని.. పనిలో పడి సంసారాన్ని సక్కదిద్దుకోలేదని అన్నారు. కేసీఆర్ రూల్ రూల్ అని మన ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు నేరుగా లబ్ధిదారులకే అందించడం జరిగిందని పేర్కొన్నారు. కార్యకర్తలను ద్వారా అందించలేకపోయామని.. అందుకే కొంత కార్యకర్తలకు గౌరవం దక్కలేదని అన్నారు. భవిష్యత్తులో కార్యకర్తల బలం పెరిగేలా, గౌరవం దక్కేలా పార్టీ అందుకు కృషి చేస్తుందని అన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేద్దాం.. గులాబీ జెండా ఎగరవేద్దామని హరీష్ రావు అన్నారు.

Most Popular