Saturday, November 30, 2024

E-Paper

Homeతెలంగాణబాధితులకు బాసటగా పోలీసు భరోసా కేంద్రం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

బాధితులకు బాసటగా పోలీసు భరోసా కేంద్రం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

ఆయుధం జనగామ
లైంగిక దాడులకు గురైన మహిళలు,బాలబాలికలకు భరోసా కేంద్రం ఆసరాగా నిలుస్తుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో ఉమేన్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన భరోసా కేంద్రాన్ని రాష్ట్ర పోలీస్ డిజిపీ రవి గుప్తాతో అడిషనల్ డిజిపీలు షికా గొయల్, మహేష్ భగత్ తో కల్సి వర్చవల్ ద్వారాజనగాంలో నూతనంగా నెలకొల్పబడిన భరోసా కేంద్రాన్నిప్రారంభించారు. అనంతరంవరంగల్ పోలీస్ కమిషనర్ జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, డిసిపీ సీతారాంతో కల్సి శిలాఫలాకాన్నిప్రారంబిచారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ భరోసాకేంద్రం పనితీరును తెలియజేస్తూ లైంగిక దాడులకు గురైన బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించబడుతుందని అన్నారు.ఇందులో భాగంగానే భాదితులకు  న్యాయపరమైన సహకారంతో పాటు వైద్య, ఆర్థికసహకారాన్నిఅందించబడుతుందని.వీటితో పాటు బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని తెలిపారు. అవసరంనుకుంటే బాధితులకు భరోసా కేంద్రంలో ఆశ్రయం కల్పించబడటంతో పాటు బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారన్నిఅందింస్తామని అన్నారు.ఈ కేంద్రంలో లీగల్,మెడికల్ సిబ్బందితోపాటు ఇతర సహాయ సిబ్బందికి సంబందించి పూర్తిగా మహిళలు విధులు నిర్వహిస్తారని.ముఖ్యంగా బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లనవసరం లేకుండా బాధితులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించబడుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమం జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, డీసీపీ సీతారాం, ఏసీపీ దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్ రావు, జనార్దన్ రెడ్డి, కృష్ణ తో పాటు వెస్ట్ జోన్ కు చెందిన ఇన్స్ స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్ స్పెక్టర్లు, ఎస్. ఐ లు, భరోసా కేంద్రం సిబ్బందితో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Most Popular