Saturday, November 30, 2024

E-Paper

Homeతెలంగాణమేడారంలో పారిశుద్ధ్య నిర్వహణకు తరలి వెళ్లిన మునిసిఫల్ సిబ్బంది

మేడారంలో పారిశుద్ధ్య నిర్వహణకు తరలి వెళ్లిన మునిసిఫల్ సిబ్బంది

ఆయుధం వరంగల్
మేడారం మహా జాతర సందర్భంగా పారిశుద్ధ్యసేవల నిర్వహణ కు బల్దియా కు చెందిన పారిశుధ్య సిబ్బంది సోమవారం బస్సుల్లో తరలివెళ్లారు.ఈ సందర్భం గా సిబ్బంది కోసం ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన బస్సులను నగర మేయర్ గుండు సుధారాణి సోమవారం ప్రధాన కార్యాలయ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ మేడారం మహా జాతర సందర్భంగా జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం పారిశుధ్య సేవలు అందించడానికి బల్దియా నుండి సిబ్బందిని పంపించడం ఆనవాయితీ గా వస్తుందని తెలిపారు.ప్రజారోగ్య విభాగం నుంచి 550 మంది పారిశుద్ధ్య కార్మికులు, 30 మంది జవాన్లు,6 శానిటరీ ఇన్స్పెక్టర్లు. 2 శానిటరీ సూపర్వైజర్లు, చెత్త సేకరణ కోసం 30 స్వచ్ఛ ఆటోలు, మూడు ట్రాక్టర్లు, 1 టిప్పర్, ఒక డోజర్, అర్బన్ మలేరియా నుంచి ఒక హెల్త్ ఇన్స్పెక్టర్,5 గురు హెల్త్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ విభాగం నుండి ఈ ఈ, డీ ఈలు, ఏ ఈలు వెళ్లనున్నారు. పారిశుద్ధ్య సేవలు, తాగునీటి సరఫరా పర్యవేక్షణ కోసం వింగ్ అధికారులు 5 రోజుల పాటు అక్కడే అందుబాటులో ఉంటారని అన్నారు. బల్దియా నుంచి వెళ్లే ఉద్యోగులు,సిబ్బంది కోసం మేడారంలో ప్రత్యేకంగా వసతి, భోజనం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని,అందుకు సంబందించిన వంట సామాగ్రిని ఇక్కడి నుండే పంపిస్తున్నట్లు మేయర్ తెలిపారు. ఈకార్యక్రమంలో అదనపు కమిషనర్ అనిసుర్ రషీద్ సి ఎంహెచ్ ఓ డాక్టర్ రాజేష్ సానిటరీ సూపర్వైజర్లు సాంబయ్య, నరేందర్, భాస్కర్ తో పాటు సానిటరీ ఇన్స్పెక్టర్లు జవాన్లు తదితరులు పాల్గొన్నారు.

Most Popular