Saturday, November 30, 2024

E-Paper

Homeతెలంగాణవరంగల్ కూరగాయల మార్కెట్ మోడల్ గా తీర్చిదిద్దుతాం: అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ...

వరంగల్ కూరగాయల మార్కెట్ మోడల్ గా తీర్చిదిద్దుతాం: అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

వరంగల్ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ గా మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం నగర మేయర్  సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ, సంబంధిత శాఖల అధికారు లతో కలసి వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్ లను పరిశీలించి, రైతులు, వ్యాపారులు, విక్రయదారులతో కలియతిరుగుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తాను శాసన సభ్యులుగా ఉన్నప్పుడు నిరుపేదలకు,అర్హులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో మాడల్ మార్కెట్ కు శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించడం జరిగిందన్నారు.గత రాజకీయ నాయకుల ప్రాబల్యంతో అనర్హులు బినామీ పేర్ల మీద దుకాణాలు కేటాయించుకొని విక్రయదారుల నుండి డబ్బులు వసూలు చేసుకుంటూ దందా నిర్వహిస్తున్నారని తెలిపారు. దుకాణాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, అర్హులకు అన్యాయం జరిగిందని, ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ నిర్వహించి అనర్హులకు ఖచ్చితంగా తొలగించి లైసెన్స్ ఉన్న వారిని, నిజమైన అర్హులకు మాత్రమే పారదర్శకంగా దుకాణాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కూరగాయల మార్కెట్ను మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దుటకు గాను ప్రత్యేక కన్సల్టెన్సీ ద్వారా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించాలని, అందులో పార్కింగ్, వర్మీ కంపోస్ట్, సోలార్ ఎనర్జీ, అంతర్గత రహదారులు, డ్రైనేజ్, పార్కింగ్, వాహనాల రాకపోకలకు వేర్వేరు మార్గాలు ఉండేలా చూడాలన్నారు. వర్షాకాలంలో కొనుగోలుదారులు, విక్రయెతలకు తడవకుండా ఇబ్బందులు కలగకుండా పెద్ద షెడ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.అధికంగా ఉన్న దుకాణ అద్దెలు తగ్గించాలని మంత్రికి విక్రయదారులు విజ్ఞప్తి చేయగా వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావును చరవాణిలో సంప్రదించి అద్దెలు తగ్గించాలని కోరగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుముఖత వ్యక్తం చేస్తూ ప్రతిపాదనలు పంపాల్సిందిగా మంత్రి సురేఖను కోరారు.ప్రస్తుతం నిర్మాణం కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ లో కూరగాయలు. పూల, పండ్ల మార్కెట్ కొరకు వినియోగించు కుంటామని, నాన్ వెజ్ మార్కెట్ కొరకు సమీపంలోని స్థలంలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పురాతన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, మార్కెట్లో ఉన్న క్లాక్ టవర్, కార్యాలయ భవనాన్ని తొలగించడం జరగదని అన్నారు. మార్కెట్లో నిర్మిస్తున్న కొత్త భవనాన్ని ఫంక్షన్ హాల్ గా వినియోగించు కోవాలన్నారు. మర్రిచెట్టు వద్ద ఉన్న స్థలంలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని, విఘ్నేశ్వరుడి, మైసమ్మ తల్లి డేవాలయాలు ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించి నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, కొనుగోలుదారుల వాహనాలను మార్కెట్లోకి అనుమతించకూడదన్నారు. అవుట్సోర్సింగ్ ద్వారా మార్కెట్ లో పారిశుద్ధ్యబికార్మికులను, వాచ్మేన్ లను నియమించుటకు చర్యలు తీసుకొంటామని అన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, మార్కెట్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, ప్లాస్టిక్ వెండింగ్ మిషన్ ని ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ మార్కెట్లో దారుల వ్యాపారుల సమస్యలను పరిష్కరించుటకు విచ్చేసిన మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కోరిన విధంగా మంత్రి కోరిన విధంగా జి డబ్ల్యూ ఎంసీ ద్వారా 30 లక్షల రూపాయల వ్యయంతో షెడ్డు ని ఏర్పాటు చేస్తామన్నారు.ఈ సందర్భంగా లక్ష్మీపురం లో 24 కోట్ల రూపాయల వ్యయంతో కొనసాగుతున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనుల మ్యాప్ ను క్షేత్ర స్థాయిలో మంత్రి పరిశీలించి, అదేవిధంగా ఆధునిక విధానాలు హంగులతో నిర్మిస్తున్న వరంగల్ టి జి ఆర్ టి సి బస్ స్టేషన్ పనులను పరిశీలించి, పురోగతిని అధికారులు అడిగి తెలుసుకోని ఆయా పనులను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.అనంతరం శివనగర్ లోని సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి,నూతన కమ్యూనిటీ హాల్ ఏర్పాటు పనులకు మంత్రి కొండా సురేఖ మేయర్ గుండు సుధారాణి తో కలిసి శంకుస్థాపన చేశారు .ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్ చింతాకుల అనిల్, ఇంచార్జ్అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, బల్దియా ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, సి ఎం హెచ్ ఓ డాక్టర్ రాజిరెడ్డి, ఛాంబర్ ఆర్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి నిర్మల, రెవెన్యూ మార్కెటింగ్ జి డబ్ల్యూ ఎం సి పోలీస్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Most Popular