Saturday, November 30, 2024

E-Paper

Homeతెలంగాణవరంగల్ నగరంలో వీధి కుక్కలు,పెంపుడు కుక్కలపై అవగాహన

వరంగల్ నగరంలో వీధి కుక్కలు,పెంపుడు కుక్కలపై అవగాహన

వరంగల్ ఆయుధం
వరంగల్ మహనగరంలో జీడబ్ల్యుఎంసి ఆధ్వర్యంలో మంగళ వారం వెంకటేశ్వర గార్డెన్స్ లో వీధి కుక్కల,పెంపుడు కుక్కలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నగర మేయర్ గుండు సుధారాణి,బల్దియా కమీషనర్ షేక్ రిజ్వాన్ భాషా,హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా హజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడూతూగ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలో గల 66డివిజన్ లలో వీధి కుక్కల బెడద చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉన్న అన్ని కుక్కలకు స్టేరిలైజ్ చేసి మళ్ళీ అదే డివిజన్ లో వదలడం జరుగుతుందని తెలిపారు.కుక్కల నివారణకు ప్రతి పౌరుడి మానవతా దృక్పథంతో వీధి కుక్కలకు కనీస ఆహారం ,నీరు కల్పించే విధంగా కార్పోరేషన్ ఏర్పాట్లు చేస్తోందని మేయర్ గుండు సుధారాణి చెప్పారు. కార్పొరేటర్ లు మాత్రం ఇందుకు విభిన్నంగా అవేదన వ్యక్తం చేసారు. డివిజన్ లో కుక్క కాటుకు గురై చాలా మంది ఇబ్బందులకు గురౌతున్నారు, చట్టం మారితే తప్ప విధి కుక్కల నివారణకు ఏం చేయలేక పోతున్నామని అవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో , కార్పొరేటర్ లు గుండేటి నరేందర్ కుమార్ సురేష్ జోషి, బస్వరాజు కుమార స్వామి, దిడ్డి కుమార స్వామి, పోశాల పద్మ, చింతాకుల అనిల్ కుమార్, మరుపల్ల రవి, సిద్దం రాజు,ఓని స్వర్ణలత,ప్రవీణ్ తో పాటు అదనపు కమీషనర్,జిల్లా అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Most Popular