Thursday, April 3, 2025

E-Paper

Homeతెలంగాణవిద్యుత్ అధికారులు తమ విధి నిర్వహణలో కూడా సామాజిక కార్యక్రమాలు చేపట్టాలి.

విద్యుత్ అధికారులు తమ విధి నిర్వహణలో కూడా సామాజిక కార్యక్రమాలు చేపట్టాలి.

హన్మకొండ నక్కలగుట్ట సబ్ డివిజన్ ఆఫీస్ ఆవరణలో తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో విద్యుత్ వెలుగులను ప్రసరించినట్లు విద్యుత్ అధికారులు తమ విధి నిర్వహణలో కూడా సామాజిక కార్యక్రమాలు చేపడుతుండటం అభినందనీయమని అన్నారు. వేసవిలో పాదచారులకు దాహర్దిని తీర్చడానికి చలి వేంద్రాలు నెలకొల్పి వారి దాహర్ధిని తీర్చుతున్నారని పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో 16 ఎన్జీఓస్ ఆధ్వర్యంలో వసతి పొందుతున్న దాదాపు మూడువేల మంది మానసిక వికలాంగులకు , వృద్దులకు , అనాధలకు, వితంతులకు, ప్రతి నెల సహాయం చేయడం విద్యుత్ ఉద్యోగుల ఉదారతకు చిహ్నమని పేర్కొన్నారు . ఎన్పీడీసీఎల్ ఉద్యోగుల ఎల్లపుడూ సామజిక కార్యక్రమాల్లో ముందు ఉంటారని స్పష్టం చేశారు. ప్రతి ఏటా తప్పకుండ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ ఆధ్వర్యంలో చలి వేంద్రాన్ని ప్రారంభించడం సంతోషమని అన్నారు. పేదలకు తమ స్థాయిలో సేవ చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉంటదని తెలిపారు.తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఇంచార్జి డైరెక్టర్లు అశోక్ కుమార్ , సదర్ లాల్ , మధుసూదన్ , సీజియం లు రవీంద్రనాథ్ , వెంకటరమణ , జియం లు వేణు బాబు , హన్మకొండ ఎస్ఈ మధుసూదన్ .తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ ఆసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ బి.సి రెడ్డి ,ఎన్పీడీసీఎల్ సెక్రటరీ జనరల్ నార్ల సుబ్రమణేశ్వర్ రావు,అడ్వైజర్  మధుసూదన్, అధ్యక్షులుఇంద్రసేనా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ . నరేందర్, ఎన్పీడీసీఎల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మల్లికార్జున్,హన్మకొండ సర్కిల్ సెక్రటరీ యం.అనిల్ కుమార్,ఆసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Most Popular