అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ను కలెక్టర్ సిక్తా పట్నాయక్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని అగ్నిమాపక అధికారులకు సూచించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 8712699304, 8712699305 మొబైల్ నెంబర్లకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి భగవాన్ రెడ్డి, సహాయ అగ్నిమాపక అధికారి జయపాల్ రెడ్డి,హన్మకొండ, వరంగల్ జిల్లాల అగ్నిమాపక కేంద్రాల స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు రవీందర్, నాగరాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.