Friday, November 8, 2024

E-Paper

Homeతెలంగాణఇంజనీరింగ్ అధికారులతో అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతిపై సమీక్ష

ఇంజనీరింగ్ అధికారులతో అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతిపై సమీక్ష

ఆయుధం వరంగల్
గ్రేటర్ వరంగల్ మునిసిఫల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ పరిధికి సంబంధింత శాఖల ఏఈలను ఇప్పటి వరకు పూర్తయిన నిర్మాణంలో ఉన్న పనుల స్థితిగతులను డిఈ లను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ పరిధిలో గల పాఠశాలల్లో పనులలో వేగం పెరగాల్సిన అవసరం ఉందని ప్రధానంగా పాఠశాల లలో త్రాగునీటి వసతులు ఏర్పాటు వంటి ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుగా పూర్తి చేయాలని సూచించారు, ముందుగా మైనర్ సంబంధిత పనులను పూర్తి చేసి మేజర్ పనులపై దృష్టి సారించాలని పాఠశాలల్లో టాయిలెట్ నిర్మాణ సంబంధిత పనులు మినహా మిగతా పనులన్నీ ఈ నెల 31 లోగా పూర్తి చేయాలని పనులను వేగంగా పూర్తి చేయడానికి లేబర్ సంఖ్యను పెంచి పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఈ కృష్ణరావు, ఈఈ లు రాజయ్య శ్రీనివాస్, డిఈలు రవికుమార్, సంతోష్ బాబు, సారంగం, రంగరావు రవికిరణ్ శివానంద్ తదితరులు పాల్గొన్నారు.

Most Popular