మెదక్ నియోజకవర్గం పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోస్గులు జాగ్రత్తగా ఉద్యోగం విధులు నిర్వరించాలని మెదక్ ఎంపి బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు సూచించారు. బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థి ఆదివారం రాత్రి నిర్వహించిన ఉద్యొగస్థులతోటి సమావేశం నిర్వహించిన సమావేశంలో ఉద్యోగస్థులు పాల్గోనందుకు ఆయన తప్పుపట్టారు వారిపై ఎన్నికల ఉన్నతాధికారలు చట్ట రిత్య చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. ఆదివారం నాడు సమావేశం నిర్వహిస్తున్న విషయం బిజెపి నాయకులు తెలుసుకొని ఉన్నతాధికారలకు సమాచారం తెలిపిన తగు విధంగా స్పందించలేదని అన్నారు. చాల మార్లు సిద్దిపేట ఎఆర్ఓ కు సమాచారం ఇచ్చెందుకు ఫోన్ చేసిన సరిగా రెస్పన్స్ కాలేదన్నారు. సోమావారం నాడు నామాత్రంగా సిద్దిపేట పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాం రెడ్డి గ్రామాల వారిగా మహిళ సంఘాలతో పనిచేసే సెర్పు ఉద్యోగులతో సమావేశం నిర్వహించారని వారి ద్వారా ఓటర్లకు డబ్బులు పంచాలని ప్రణాళిక చేశారని తెలిపారు. ఉద్యోగస్థులు మీరు మీ విధులు చేసుకొవాలని ఎవరైన ఆలాంటి పనులు చేస్తే మీపై చట్ట రీత్య కేసులు పెడతామిని వారికి సూచనలు చేశారు. ఆ సమావేశం పాల్గోన్న వారిపై సిద్దిపేట మూడవ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఆర్ఐ కేసు నమోదు కావడం జరిగిందని ఆయన చెప్పారు.