ఆయుధం న్యూస్ వరంగల్
వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు వరంగల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకీర్తి నగర్ ఆరోగ్య మహిళా క్లినిక్ ను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందించవలసిన సేవల గురించి, సమయపాలన గురించి రొగులకు వివరించారు.ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని మాతా శిశు సంరక్షణ, ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీలు, వ్యాధి నిరోధక టీకాలు, అందించాలని సిబ్బందికి సూచించారుసంక్రమిత వ్యాధులు, అసంక్రమిత వ్యాధులు నిర్ధారణ పరీక్షలు చేయించి తగు చికిత్సలు అందించాలని కొరారు.. ప్రజలు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సూచనలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని తెలిపినారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే వెంటనే వైద్య సిబ్బంది ద్వారా తగు చికిత్సలు తీసుకోవాలని సూచించారు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,పల్లె దవఖానాలుప్రజలఆరోగ్య అవసరాలకుఏర్పాటుచేయడంజరిగిందన్నారు.సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని కోరారు. సమయపాలన పాటించని ఉద్యోగులపై చర్యలు ఉంటాయని తెలిపారు.ఎండాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు నీళ్ల విరోచనాలు, బంక విరోచనాలు, అంటువ్యాధులు,వడ దెబ్బ గురించి తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని ఎలాంటి వ్యాధులకు గురి అయిన వెంటనే వారికి తగిన చికిత్సలు అందించాలని ఆదేశించారు.ఎండాకాలంలో ప్రతి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో ఆరోగ్య కేంద్రాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కార్నర్ పెట్టాలని గడువు దాటి పోయిన మందులు ఏమైనా ఉంటే వెంటనే వాటిని డిస్పోజేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని డాక్టర్ జాబిలి,డిప్యూటీ డెమో అనిల్ కుమార్, ఎల్డి కంప్యూటర్ నాగరాజు,వైకుంఠం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.